Cyber Fraud: గూగుల్‌ని గుడ్డిగా నమ్మి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి.. లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి వేలల్లో కాదు లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నారు. గూగుల్ ని గుడ్డిగా నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్న వారిలో చదువుకున్నవారు కూడా ఉంటున్నారు. తాజాగా ఓ వ్యక్తీ క్యాబ్ బుక్ చేసుకునే ప్రయత్నంలో లక్షలు పోగొట్టుకున్నాడు.

Cyber Fraud: గూగుల్‌ని గుడ్డిగా నమ్మి  సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి.. లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి
Cyber Fraud
Follow us
Ranjith Muppidi

| Edited By: Surya Kala

Updated on: Nov 13, 2024 | 7:11 PM

గూగుల్ ని గుడ్డిగా నమ్మి చేతులు కాల్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి కర్ణాటక లోని ఉడిపిలో క్యాబ్ బుక్ చేసుకునే క్రమంలో ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు ఒక ఫేక్ కార్ రెంటల్ కనిపించింది. శక్తి కార్ రెంటల్స్ అని కనిపించిన లింక్ పై క్లిక్ చేసి కార్డ్ వివరాలు నమోదు చేశాడు. కొద్దిసేపటికి కంపెనీ ప్రతినిధుల అంటూ ఓ వ్యక్తి కాల్ చేసి వెబ్సైట్ ద్వారా టోకెన్ గా 150 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాలంటూ సూచించడంతో తన కార్డు ద్వారా ఫీ చెల్లించేందుకు ప్రయత్నించాడు. అయితే లావాదేవీలు పూర్తి చేసేందుకు కావలసిన ఓటీపీ రాలేదు. కానీ కొద్దిసేపటికి అతని ఖాతా నుంచి ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ నుంచి 3లక్షల 38 వేల రూపాయలు, కెనరా బ్యాంక్ డెబిట్ కార్డ్ నుంచి 80,056 మొత్తం 4.1 లక్షలు కోల్పోయాడు.

దీంతో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ ఫేక్ లేదా ఒరిజినల్ అనే విషయం తెలుసుకోవాలి అని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మరోవైపు గూగుల్ సైతం ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కొత్త అల్గారిథమ్స్ ను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ తరహా మోసాలకు ఎక్కువగా అమాయకుల గురవుతుండడంతో సైబర్ క్రైమ్ పోలీసులు పబ్లిక్ ప్లాట్ఫార్మ్స్ వద్ద అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంక్ అకౌంట్ ఇతర వివరాలు అడిగే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరూ ఎవరికి కూడా బ్యాంక్ వ్యక్తిగత వివరాలు ఓటిపి లాంటివి చెప్పవద్దని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?