AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Collagen Powder: అందానికి , ఆరోగ్యానికి కొల్లాజెన్ పౌడర్ ఎలా ఉపయోగపడుతుంది..? ఎలా తీసుకోవాలో తెలుసా..!

కొల్లాజెన్ గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. కనుక ఈ రోజు కొల్లాజెన్ అంటే ఏమిటి? దీనిని సప్లిమెంట్ గా ఎలా తీసుకుంటారు..? కొల్లాజెన్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Collagen Powder: అందానికి , ఆరోగ్యానికి కొల్లాజెన్ పౌడర్ ఎలా ఉపయోగపడుతుంది..? ఎలా తీసుకోవాలో తెలుసా..!
Collagen Powder BenefitsImage Credit source: pexels
Surya Kala
|

Updated on: Nov 13, 2024 | 5:20 PM

Share

కొల్లాజెన్ ఈ పేరును చాలాసార్లు విని ఉంటారు. సెలబ్రిటీలు కూడా తమ చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొల్లాజెన్ ను సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటారు. ప్రస్తుతం కొల్లాజెన్ ను బూస్టర్ డోస్‌లుగా తీసుకోవడం లేదా పౌడర్ తీసుకోవడం లేదా కొల్లాజెన్ ఉత్పత్తులను ఉపయోగించడం అనే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పటికీ ఈ కొల్లాజెన్ గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే కొల్లాజెన్ తీసుకుంటే శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలుసా.. ఏదైనా సప్లిమెంట్ తీసుకునే ముందు, కొల్లాజెన్ అంటే ఏమిటి? కొల్లాజెన్ పౌడర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.

కొల్లాజెన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్ చర్మంలో స్థితిస్థాపకతను నిర్వహించడానికి అవసరం. అంతేకాదు ఇది కణజాలాలను రిపేర్ చేయడం, కణజాలాలను నిర్వహించడం, రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

కొల్లాజెన్ అంటే ఏమిటి?అది శరీరంలో ఎలా ఏర్పడుతుంది?

ఇవి కూడా చదవండి

కొల్లాజెన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది అతిపెద్ద పరిమాణం జంతువులలో ఉంటుంది. ఈ ప్రోటీన్ శరీరం కణాలు, కణజాలాల నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీనిలో కనీసం 28 రకాలున్నాయి. శరీరంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసి నిర్వహించే ఫైబ్రోబ్లాస్ట్‌లు అని పిలువబడే బంధన కణాలను కలిగి ఉంటుంది. వయస్సు పెరిగేకొద్దీ ఈ కొల్లాజెన్ విచ్ఛిన్నం ప్రారంభమవుతుంది లేదా ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ప్రొటీన్ దెబ్బతింటే చర్మంపై ముడతలు, పొడిబారడం, చర్మం మందంగా మారడం, వదులుగా మారడం వంటి లక్షణాలు చర్మంపై కనిపించడం ప్రారంభిస్తాయి. ఎముక సాంద్రతకు కొల్లాజెన్ కూడా ముఖ్యమైనది. అందువల్ల కొల్లాజెన్ లేకపోవడం వల్ల ఎముకలు బలహీన పడతాయి.

కొల్లాజెన్ పౌడర్ అంటే ఏమిటి?

కొల్లాజెన్ శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. ఇందుకోసం చేపల చర్మం, రొయ్యలు మొదలైన సముద్రపు ఆహారాలను ఆహారంలో తీసుకోవచ్చు. అంతే కాదు చికెన్ మొదలైనవి తినడం కూడా మేలు చేస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడతాయి. ప్రస్తుతం కొల్లాజెన్ పౌడర్ ఈ లోపాన్ని భర్తీ చేయడానికి తీసుకోవచ్చు. దీనిని కాఫీ, స్మూతీ, గంజి, ఓట్స్ మొదలైన ఏదైనా చల్లని లేదా వేడి ఆహారంతో కలిపి తీసుకోవచ్చు. అనేక అధ్యయనాలు కొల్లాజెన్ పౌడర్ తీసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. సాగే గుణాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ముడుతలను తగ్గిస్తుందని తెలిసింది.

అత్యంత ప్రజాదరణ పొందిన కొల్లాజెన్ రకం.. హైడ్రోలైజ్డ్ కొల్లాజెన్ సప్లిమెంట్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది ప్రోటీన్‌ను ముక్కలుగా విడగొట్టే ప్రక్రియ. ఇది శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. కొల్లాజెన్ పౌడర్ మహిళల ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీని కారణంగా మెనోపాజ్ తర్వాత బోలు ఎముకల వ్యాధి, ఆస్టియోపెనియా (ఎముక సంబంధిత వ్యాధి) ప్రమాదం తగ్గుతుంది.

కొల్లాజెన్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే?

కొల్లాజెన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వలన కలిగే నష్టాలు గురించి ప్రస్తావిస్తే.. దీనిని తీసుకోవడం వలన ఎటువంటి ప్రతికూల ప్రభావాలు కనిపించవు. అయితే మార్కెట్లో లభించే కొల్లాజెన్ పౌడర్‌లో అనేక ఇతర పోషకాలు అంటే అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి, తద్వారా చర్మం, గోర్లు , జుట్టు ఆరోగ్యంగా తయారవుతాయి. అదే సమయంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా చేరుకోవడంతో ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చు లేదా మందులతో ప్రతి చర్యలు కూడా కలగవచ్చు. కనుక కొల్లాజెన్ పౌడర్‌ను నేరుగా మార్కెట్ నుంచి నేరుగా కొనుగోలు చేయడానికి బదులుగా.. నిపుణుడిని సంప్రదించి తదనుగుణంగా తగిన పరిమాణంలో తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)