Sabarimala: శబరిమల వర్చువల్ క్యూ దర్శనం ఆన్‌లైన్ టిక్కెట్‌ను ఎలా బుక్ చేసుకోవడం ఎలా అంటే..

ప్రతి సంవత్సరం అయ్యప్ప దర్శనం కోసం భారీ సంఖ్యలో శబరిమలకు చేరుకుంటారు. అయితే ఏడాది ఏడాదికి అయ్యప్పను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రస్తుతం కేరళ ప్రభుత్వం దర్శనం కోసం ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకునే వీలు కల్పిస్తుంది. శబరిమల టిక్కెట్ల బుకింగ్ ఆన్‌లైన్‌లో ప్రారంభించింది. అయ్యప్పను దర్శించుకునేందుకు ఆలయంలోకి వెళ్ళే దర్శించుకునే రోజువారీ భక్తులు సంఖ్య 70,000 మాత్రమే. శబరిమల యాత్రికుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు (టీడీబీ) వర్చువల్ క్యూను తెరిచింది. రోజువారీ పరిమితిని 70,000 స్లాట్‌లను సెట్ చేసింది. ఈ చర్య వల్ల ఈ సీజన్‌లో భక్తుల రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు.

Sabarimala: శబరిమల వర్చువల్ క్యూ దర్శనం ఆన్‌లైన్ టిక్కెట్‌ను ఎలా బుక్ చేసుకోవడం ఎలా అంటే..
Shabarimala Ayyappa Temple
Follow us
Surya Kala

|

Updated on: Nov 13, 2024 | 3:57 PM

అయ్యప్ప భక్తుల కోసం కేరళ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. శబరిమల ఆలయంలో వర్చువల్ క్యూ బుకింగ్‌ను ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) బుధవారం ప్రారంభించింది. శబరిమలోని అయ్యప్పను ప్రతిరోజూ వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా 70,000 మందితో సహా మొత్తం 80,000 మంది యాత్రికులకు ఒక రోజులో దర్శనం చేసుకునే వీలు కల్పిస్తుంది.  70 వేల మంది అయ్యప్ప భక్తులు దర్శనం చేసుకునే వీలు కల్పించడంతో మిగిలిన 10,000 స్లాట్లపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని శబరిమల యాజమాన్యం తెలిపింది. ‘స్పాట్ బుకింగ్’ అనే పదాన్ని స్పష్టంగా ఉపయోగించనప్పటికీ.. స్పాట్ బుకింగ్‌ల కోసం స్లాట్‌లు రిజర్వ్ చేయబడతాయని తెలుస్తోంది. గతేడాది కూడా భక్తుల కోసం ఆన్‌లైన్‌లో 70 వేల బుకింగ్‌లు జరిగాయి.

అయితే శబరిమల ఆలయంలో దర్శనానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని ప్రభుత్వం చెప్పింది. స్పాట్ బుకింగ్ అనే పదాన్ని ఉపయోగించలేదు. అయితే ప్రస్తుతం ఆన్ లైన్ లో బుకింగ్ వ్యవస్థపై అవగాహన లేకుండా శబరిమలకు వచ్చే భక్తులకు, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనం కల్పిస్తామని సీఎం పినరయి విజయన్ తెలిపారు.

ఈ వారం ప్రారంభంలో శబరిమల దర్శనానికి స్పాట్ బుకింగ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. వర్చువల్ బుకింగ్ కోసం కఠినమైన ఆదేశం ఉన్నప్పటికీ.. ముందస్తు నమోదు లేకుండా నిర్దిష్ట సంఖ్యలో యాత్రికులు వస్తారని బోర్డు అంచనా వేస్తోందని TDB అధికారి తెలిపారు. అలాంటి వారికి ఈ రిజర్వ్‌డ్ స్లాట్‌లు కేటాయించబడతాయని అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

TDB వెబ్‌సైట్, యాప్‌లో వర్చువల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు తమ స్లాట్‌లను ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు ఆలయ సముదాయం ప్రవేశ ద్వారం వద్ద చూపించడానికి QR కోడ్ ఇవ్వబడుతుంది. రోజుకు 70,000 మంది భక్తులు శబరిమల దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. నేరుగా శబరిమలకు వచ్చే భక్తులకు మరో 10 వేల టిక్కెట్లు ఇవ్వనున్నారు.

శబరిమల వర్చువల్ క్యూ పాస్ ఎలా బుక్ చేసుకోవాలంటే

మీ ఫోన్ నంబర్ , ఇమెయిల్ ఉపయోగించి లాగిన్ అవ్వండి

మొదటిసారి రిజిస్టర్ చేసుకునే వారు అయితే కొత్త యూజర్ IDని సృష్టించాలి. ప్రమాణీకరణ కోసం OTP పంపబడుతుంది.

అనంతరం ID ప్రూఫ్ వివరాలతో పాటు పేరు, చిరునామా, మొబైల్ నంబర్‌ వంటి వివరాలను పూర్తి చేయండి

ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ వంటి అన్ని చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ID రుజువును కూడా అప్ లోడ్ చేయండి

ఇప్పుడు “కొనసాగించు” బటన్‌పై క్లిక్ చేయండి.

తర్వాత ఇచ్చిన ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది.

OTPని జారీ చేసి తద్వారా ఖాతాను ధృవీకరిస్తారు

ఇప్పుడు అప్పయ్య ఆలయాన్ని ఎప్పుడు సందర్శించాలని అనుకుంటున్నారో ఆ రోజును ఎంచుకోండి.

శబరిమల వర్చువల్ క్యూ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.

అయితే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వర్చువల్-క్యూ బుకింగ్ అవసరం లేదు.

శబరిమల వెళ్ళే మార్గాలు:

యాత్రికులు 2 వేర్వేరు మార్గాల ద్వారా కాలినడకన శబరిమల చేరుకోవచ్చు. ఒకటి పంబా నుంచి మరొకటి ఎరుమేలి నుంచి శబరిమల చేరుకోవచ్చు. పంబా మార్గం చిన్నది. నీలిమల మార్గ్ అని కూడా పిలువబడే 5 కి.మీ. మరో మార్గం ఎరుమేలి మార్గం 40 కి.మీ. దీనిని పెరియ పతై (దీర్ఘ మార్గం) అంటారు. ఇది చివరికి పంబ మార్గంలో కలిసిపోతుంది. పంబ రూట్ బుకింగ్‌లు తెరిచి ఉన్నాయి.

శబరిమల ఆలయం కేరళలోని పశ్చిమ కనుమలలో ఉన్న ఒక హిందూ దేవాలయం. హరిహర సుతుడు అయ్యప్పకు అంకితం చేయబడిన ఆలయం. ఇది దేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం శబరిమల కొండపై 914 మీటర్ల (3,000 అడుగులు) ఎత్తులో ఉంది. మండలం-మకరవిళక్కు పండుగ అని పిలువబడే వార్షిక తీర్థయాత్ర సమయంలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు చేరుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..