AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: మానసిక, ఆర్ధిక సమస్యలా.. ఇంట్లో సింధూర గణేష విగ్రహం మంచి రెమిడీ.. ఎక్కడ పెట్టుకోవడం శుభప్రదం అంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతిరోజూ గణపతిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం. అలాంటి పరిస్థితుల్లో ఇంటి ప్రధాన ద్వారం వద్ద సింధూర గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తులన్నీ దూరమవుతాయి. అలాగే కుటుంబ సభ్యులు మానసిక, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

Astro Tips: మానసిక, ఆర్ధిక సమస్యలా.. ఇంట్లో సింధూర గణేష విగ్రహం మంచి రెమిడీ.. ఎక్కడ పెట్టుకోవడం శుభప్రదం అంటే..
Sindhura Ganesha Idol
Surya Kala
|

Updated on: Nov 13, 2024 | 4:29 PM

Share

హిందువులు పూజించే దేవుళ్లలో వినాయకుడు ఒకడు. శివ పార్వతుల తనయుడు వినాయకుడు విఘ్నాలకాధిపతిగా పూజలను అందుకుంటున్నాడు. ఇంట్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు మొదలు పెట్టాలంటే ముందుగా వినాయకుడిని పుజిస్తారు. ఇలా చేయడం వలన గణపతి అనుగ్రహంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా శుభకార్యాలు నిరాటంకంగా సాగుతాయని.. జీవితంలోని దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఓ ప్రదేశంలో సింధూరి గణేశ విగ్రహాన్ని ఉంచడం వల్ల ప్రతికూల శక్తులన్నీ నశిస్తాయి.

హిందూ పురాణ గ్రంథాల్లో గణపతిని మొదట పూజ చేస్తారు. ఏదైనా శుభ కార్యం చేసే ముందు గణపతిని స్మరించుకోవడం వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడవు. ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక లేదా శుభ చిహ్నాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, తమ జీవితంలో ఏ లోటు రాకూడదని కోరుకుంటాడు. అటువంటి పరిస్థితిలో.. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు సింధూర గణేశ విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ ఉంచాలో తెలుసుకుందాం…

ఇంటి ప్రధాన ద్వారం వద్ద..

ఇవి కూడా చదవండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో వినాయకుడిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల సుఖ సంతోషాలు నెలకొంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇంటి ప్రధాన ద్వారం వద్ద సింధూర గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తులన్నీ దూరమవుతాయి. అంతేకాదు కుటుంబ సభ్యులు మానసిక, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

సింధూర గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో జ్యోతిషశాస్త్రపరంగా శ్రేయస్సుని కలిగించే గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి ముందు.. గణేశుడి తొండం ఎడమ వైపున ఉండాలని గుర్తుంచుకోండి. వినాయకుడి విగ్రహం ఎంచుకునే ముందు తప్పని సరిగా వినాకుడి తొండం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే వినాయకుడి తొండం కుడి వైపున ఉంటే.. కోరికలు నెరవేరడానికి ఆలస్యం అవుతుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.