AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Noida: వెబ్ సిరీస్ చూసి ఇంటినే గంజాయి వనం చేసిన యువకుడు.. ఆన్ లైన్లో అమ్మి 100 రోజుల్లో రూ. 12 లక్షలు సంపాదన..

సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసి చాలాసార్లు మంచి విషయాలు నేర్చుకునే వారు ఉంటారు.. అదే సమయంలో దొంగ తనాలు దోపిడీలు చేయడం ఎలా అనేది నేర్చుకునే వారు ఉంటారు. తాజాగా ఓ యువకుడు ఓ వెబ్ సిరీస్ ను చూసి తన ప్లాట్ లోనే గంజాయిని పండించాడు. ఇందుకోసం ఏకంగా విదేశాల నుంచి విత్తనాలను తెప్పించి గంజాయి వనాన్ని పెంచాడు. అంతేకాదు తాను పండించిన గంజాయిని అమ్మడానికి కూడా ఓ వెబ్ సైట్ ను ఎంచుకున్నాడు. కేవలం 20 మొక్కలు అమ్మి కొని రోజుల్లోనే ఏకంగా రూ.12 లక్షలు సంపాదించాడు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది.

Noida: వెబ్ సిరీస్ చూసి ఇంటినే గంజాయి వనం చేసిన యువకుడు.. ఆన్ లైన్లో అమ్మి 100 రోజుల్లో రూ. 12 లక్షలు సంపాదన..
Grown Ganja In Flat
Surya Kala
|

Updated on: Nov 13, 2024 | 2:42 PM

Share

ఓ యువకుడు తన ఫ్లాట్‌ను వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నాడు. ఓ వెబ్ సైట్ అంటే డార్క్ వెబ్‌ను ఉపయోగించి తన వ్యాపారాన్ని కొనసాగించాడు. ఈ డార్క్ వెబ్ మాత్రమే గంజాయిని సరఫరా చేసేవాడు. ఈ యువకుడు వెబ్ సిరీస్‌లు చూసి గంజాయి సాగు చేయడం నేర్చుకున్నాడు. తర్వాత విదేశాల నుంచి వాటి విత్తనాలు తెప్పించి తన ప్లాట్ లో కుండీలను ఏర్పాటు చేసి వాటిల్లో మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసి పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలోని పార్శ్వనాథ్ పనోరమా సొసైటీలోనివాసముంటున్న రాహుల్ అనే యువకుడు తన ప్లాట్ లో గంజాయిని పందిస్తున్నాడు. గత నాలుగు నెలలుగా రాహుల్ గంజాయిని సాగు చేస్తున్నాడు. నాలుగు నెలల్లోనే 50కి పైగా మొక్కలు పెంచాడు. అతని ఫ్లాట్ పై రైడ్ చేసిన పోలీసులు 2 కిలోల కంటే ఎక్కువ గంజాయి, 163.4 గ్రాముల ఓషన్ గంజాయి అంటే ప్రీమియం గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు అతని ఫ్లాట్లలో ఉన్న గంజాయి విత్తనాలతో సహా వ్యవసాయ సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

100 రోజుల్లో రూ.12 లక్షల ఆదాయం

ఇవి కూడా చదవండి

రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను 100 రోజుల్లో దాదాపు 20 గంజాయి మొక్కలు విక్రయించాడు. సుమారు 12 లక్షల రూపాయలు సంపాదించాడు. దీని తర్వాత దాదాపు 80 మొక్కలకు ఆర్డర్ వచ్చింది. వీటి ధర రూ.48 లక్షలు. అతను గంజాయి మొక్కలను తన వినియోగదారులకు డార్క్ వెబ్ ద్వారా మాత్రమే సరఫరా చేసేవాడు. అతను ఒక విదేశీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ నుంచి గంజాయి మొక్క విత్తనాలను ఆర్డర్ చేశాడు.

డార్క్ వెబ్‌లో గంజాయికి ఫుల్ డిమాండ్

గంజాయి పెంపకంపై రాహుల్‌ను పోలీసులు విచారించారు. తాను డార్క్‌వెబ్‌ ద్వారా డిమాండ్‌పై గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ఒక గంజాయి మొక్కను పండించడానికి సుమారు ఆరు నుంచి ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకొక్క మొక్క 30 నుంచి 40 గ్రాముల OG ను ఉత్పత్తి చేస్తుంది. దీని మార్కెట్ ధర 60 నుంచి 80 వేల రూపాయల వరకు ఉంటుంది. అంటే ఒక మొక్కను పెంచడానికి ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ మొక్క నుంచి 60 నుంచి 80 వేల వరకు అమ్మి లాభాలను ఆర్జించవచ్చు అని తెలిపాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమ్మమ్మల కాలం నాటి పాయ.. ఇలా తయారు చేస్తే గిన్నె లేపాల్సిందే
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
అమెరికా నుంచి భారత్‌కు చేరిన కోట్ల విలువైన 'సాంస్కృతిక సంపద'!
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రాజస్థాన్ కెప్టెన్‎కు ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా ?
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
రెట్రో స్టైల్‌ బైకులను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్‌!
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
ఏపీ పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి..
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
బూమ్రా వేసి బౌలింగు వల్ల ముంబైకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
ఎండలో 5 లీటర్ల నీళ్లు తాగిన యువకుడు.. కట్ చేస్తే ICUలోకి! షాకింగ్
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
భారత్ మ్యాప్ తారుమారు చేసిన నేపాల్ ఎయిర్‌లైన్స్..!
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..
బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం బెస్ట్ లడ్డు ఇదే..