Kitchen Hacks: చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..

చపాతీలు తినడం చాలా మందికి ఇష్టం. కానీ అవి ఒక్కోసారి గట్టిగా మారుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చపాతీలు ఎక్కువగా తినబుద్ధి కాదు. కానీ ఈ టిప్స్ పాటిస్తే చపాతీలు ఎంత సేపు అయినా మెత్తగా ఉంటాయి..

Chinni Enni

|

Updated on: Nov 13, 2024 | 5:28 PM

ఈ రోజుల్లో చాలా మంది చపాతీలు తినేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సాయంత్రం డిన్నర్‌‌లోకి ఖచ్చితంగా చపాతీలు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. రెండు రోటీలు తిని కాస్త కూర తింటే చాలు కడుపు నిండిపోతుంది. చపాతీలతో ఎలాంటి కర్రీలు తిన్నా చాలా రుచిగా ఉంటాయి.

1 / 5
అయితే చపాతీలు చేసిన కాసేపటికే ఇవి గట్టిగా మారిపోతూ ఉంటాయి. అందుకే వేడి వేడిగా చేసుకుని తింటారు. అయితే ఒక్కోసారి సమయం సెట్ కాదు. అలాంటప్పుడు ముందు చేసుకుంటారు. ఎప్పుడు చేసినా ఈ చపాతీలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి.

2 / 5
పిండిని కలిపే విధానంలోనే పద్దతి ఉంటుంది. నీటిని ఎప్పుడైనా సరే ఒకేసారి పోయకుండా.. కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేయాలి. గోరు వెచ్చని నీళ్లు ఉపయోగిస్తే చపాతీలు మెత్తగా వస్తాయి. చివరగా కొద్దిగా నూనె వేసి మళ్లీ అంతా కలపాలి.

3 / 5
పిండిని బాగా మిక్స్ చేయాలి. పిండిని కలపడమే కాదు.. చపాతీలు మెత్తగా రావాలంటే.. పిండిని బాగా మెత్తగా పిసకాలి. ఆ తర్వాత ఓ తడి క్లాత్ వేసి మూత పెట్టండి. లేదంటే కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచినా సరే పర్వాలేదు.

4 / 5
అదే విధంగా చపాతీలు చేసే విధానం వల్ల కూడా చపాతీలు మెత్తగా వస్తాయి. చపాతీపై ఎక్కువగా ప్రెస్ పెట్టకుండా. లైట్‌గా గుండ్రంగా వచ్చేలా చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేస్తే చపాతీలు గట్టిగా వస్తాయి.

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అదే విధంగా చపాతీలు చేసే విధానం వల్ల కూడా చపాతీలు మెత్తగా వస్తాయి. చపాతీపై ఎక్కువగా ప్రెస్ పెట్టకుండా. లైట్‌గా గుండ్రంగా వచ్చేలా చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేస్తే చపాతీలు గట్టిగా వస్తాయి. (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us