- Telugu News Photo Gallery These tips are the best to relieve ear pain in children, check here is details
Kids Ear Pain: పిల్లలకు చెవి నొప్పి తగ్గాలంటే .. ఈ చిట్కాలు బెస్ట్!
చలి కాలంలో వచ్చే సమస్యల్లో చెవి పోటు కూడా ఒకటి. కేవలం పెద్దలకే కాకుండా చిన్న పిల్లలో కూడా ఈ సమస్య ఉంటుంది. పిల్లలు నొప్పిని భరించలేక ఏడుస్తారు. కానీ ఈ చిట్కాలు ట్రై చేస్తే ఖచ్చితంగా రిలీఫ్ అవుతారు..
Updated on: Nov 13, 2024 | 6:27 PM

చలి కాలంలో సర్వ సాధారణంగా వచ్చే వాటిల్లో చెవి నొప్పి కూడా ఒకటి. కేవలం పెద్దలకే కాకుండా పిల్లల్లో కూడా ఈ నొప్పి కనిపిస్తుంది. ఈ కాలంలో పిల్లలకు ఎక్కువగా చెవి నొప్పి ఎటాక్ చేస్తుంది. చల్ల గాలి కారణంగా బ్యాక్టీరియా, వైరస్ కారణంగా పిల్లలకు చెవి నొప్పి వస్తుంది.

పగలు అయితే ఏదో ఒకటి చేయగలం. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఆస్పత్రికి అయినా తీసుకెళ్లగలం. కానీ రాత్రిళ్లు సరిగ్గా నిద్రలో ఉన్నప్పుడు వస్తుంది. చెవి నొప్పి వల్ల జ్వరం కూడా వస్తుంది. దీంతో పిల్లలు నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉంటారు.

పిల్లలకు చెవి నొప్పి వచ్చినప్పుడు కంగారు పడకండా.. వెంటనే ఓ పది నిమిషాలు చెవి చుట్టూ వేడిగా కంప్రెస్ చేయండి. దీని వల్ల నొప్పి తగ్గుతుంది. వైద్యుల సలహా మేరకే మందులు వేయాలి.

పిల్లలు నొప్పితో ఏడుస్తూ ఉంటే గోరు వెచ్చటి నీళ్లు తాగించండి. దీని వల్ల నొప్పి చాలా వరకు తగ్గుతుంది. చెవిలో డ్రాప్స్ ఉంటే వేయవచ్చు. దీని వల్ల ఆ రాత్రి వరకు నొప్పి కంట్రోల్ అవుతుంది.

ఒక్కోసారి చెవిలో గులిమి ఎండిపోతుంది. దీని వల్ల కూడా భరించలేనంత నొప్పి వస్తుంది. కాబట్టి గులిమి ఉందో లేదో గమనించండి. గులిమి ఉంటే చెవి డ్రాప్స్ వేయండి. అలాగే వారికి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండే ఫుడ్స్ పెట్టండి. (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




