AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakisthan: పాక్ లో ఘోర ప్రమాదం.. సింధు నదిలో పడిన పెళ్లి బస్సు.. వధూ, వరులతో సహా 26 మంది మృతి..

పెళ్లి బృందంతో కూడిన బస్సు సింధూ నదిలోకి పడిపోవడంతో వధువు, వరుడు లతో పాటు 24 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు సింధు నదిలో పడిపోవడంతో 26 మంది చనిపోయారు.

Pakisthan: పాక్ లో ఘోర ప్రమాదం.. సింధు నదిలో పడిన పెళ్లి బస్సు.. వధూ, వరులతో సహా 26 మంది మృతి..
Pak Bus AccidentImage Credit source: Diplomat Times
Surya Kala
|

Updated on: Nov 13, 2024 | 6:39 PM

Share

దాయాది దేశం పాకిస్థాన్‌ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 26 మంది మృతి చెందారు. ఈ ఘటన నార్త్ గిల్గిత్​-బాల్టిస్థాన్ (జీబీ) ప్రాంతంలో చోటుచేసుకుంది. అస్తోర్ నుంచి పంజాబ్​లోని చక్వాల్​ జిల్లాకు వెళ్తున్న పెళ్లి బస్సు డైమర్ జిల్లాలోని థాలిచి ప్రాంతంలో ఓ వంతెన పై నుంచి వెళ్తూ, సింధునదిలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 28 మంది ప్రయనిస్తున్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు.

స్థానికులు, రెస్క్యూ టీమ్‌లు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగారు. క్రేన్ సహాయంతో సిబ్బంది బస్సును నది నుంచి విజయవంతంగా వెలికి తీశారు. నది ఒడ్డున ఏదైనా మృతదేహాలు ఉన్నాయో లేదో స్థానిక నివాసితులు ఒక కన్ను వేసి ఉంచాలని పోలీసులు అభ్యర్థించడంతో దిగువ ప్రాంతాల వెంట శోధన కొనసాగుతుంది. రెస్క్యూ టీమ్ అంతకుముందు 16 మృతదేహాలను వెలికితీసింది. వాస్తవానికి వధువుని రెస్క్యూ టీం మొదట రక్షించారు. అయితే ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే గిల్గిత్లోని ప్రాంతీయ ప్రధాన కార్యాలయం (RHQ) ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించిందని డాన్ పత్రిక నివేదించింది.

మృతుల కుటుంబాలకు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గల్లంతైన వారి ఆచూకీ కోసం అన్ని విధాలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. పాకిస్థాన్​ రోడ్లు అధ్వాన్నంగా ఉండడం, ఉన్నవాటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..