Supreme Court of India: దీపావళి వేళ టపాకాయల ప్రియులకు బిగ్ షాక్.. అనుమతి లేదని తేల్చి చెప్పిన సుప్రీం..
దీపావళి వేళ టపాకాయలు పేల్చే వారికి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. టపాకాయలు పేల్చొద్దని తేల్చి చెప్పింది. పేల్చడమే కాదు.. టపాసుల విక్రయాలు, కొనుగోళ్లు, వాడకానికి అనుమతి ఇచ్చేది..

దీపావళి వేళ టపాకాయలు పేల్చే వారికి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. టపాకాయలు పేల్చొద్దని తేల్చి చెప్పింది. పేల్చడమే కాదు.. టపాసుల విక్రయాలు, కొనుగోళ్లు, వాడకానికి అనుమతి ఇచ్చేది లేదంటూ ఖరాకండిగా చెప్పేసింది. అయితే, మన వద్ద కాదులేండి. దేశ రాజధాని ఢిల్లీకి ఇది వర్తిస్తుంది. అవును, దీపావళికి టపాసుల విక్రయాలు, కొనుగోళ్లు, వాడకానికి అనుమతి ఇచ్చేది లేదంటూ సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఢిల్లీలో మళ్లీ వాతావరణ కాలుష్యం పెరుగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పర్వదినాన టపాసుల విక్రయాలు, కాల్చడాన్ని నిషేధించింది.
ఢిల్లీలో మళ్లీ పొల్యూషన్ అంతకంతకూ పెరిగిపోతోంది. పంట వ్యర్థాల దహనంతో పాటు పొగమంచు కమ్మేయడంతో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. దీంతో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీపావళి క్రాకర్స్ కొనుగోళ్లు, అమ్మకాలు, వాడకంపై నిషేధం విధించింది. అయితే, టపాసులను నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కొట్టేసింది. ప్రజల్ని స్వచ్ఛమైన గాలి పీల్చయనీయండని ధర్మాసనం వ్యాఖ్యానించింది. టపాసుల మీద ఖర్చు పెట్టే డబ్బులను, స్వీట్లమీద ఖర్చు పెట్టండని సుప్రీం వ్యాఖ్యానించారు.
అంతకు ముందు.. జనవరి 1, 2023 వరకు అన్ని రకాల బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తూ ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు ఇప్పటికే సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున న్యాయస్థానం ఈ పిటిషన్‌ను స్వీకరించడం సరికాదని జస్టిస్ యశ్వంత్ వర్మతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ పేర్కొంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




