AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: ‘బాలిక దుస్తుల మీద తాకడం లైంగిక వేధింపే’.. బాంబే హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం కోర్టు

దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 

Supreme Court: 'బాలిక దుస్తుల మీద తాకడం లైంగిక వేధింపే'.. బాంబే హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం కోర్టు
Supreme Court
Ram Naramaneni
|

Updated on: Nov 18, 2021 | 12:31 PM

Share

దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.  ఓ బాలిక దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని పేర్కొంటుందంటూ అప్పట్లో బాంబే హైకోర్టు వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.  లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని వెల్లడించింది.  ‘స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్‌  నిరూపితం కానందున ఈ చర్య పోక్సో చట్ట పరిధికి రాదని, నిందితుడిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోలేమని తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పేర్కొన్నారు. తాజాగా ఈ తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టం ఉద్దేశాన్ని నాశనం చేస్తుందని, నిందితుడు చట్టం నుంచి తప్పించుకునేందుకు దోహదపడుతుందని.. న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, ఎస్ రవీంద్ర భట్, బేలా త్రివేదిలతో కూడిన సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

కేసు వివరాలు ఇలా ఉన్నాయి…

2016లో 39 ఏళ్ల సతీష్‌ అనే వ్యక్తి  12 ఏళ్ల బాధిత బాలికకు ఫ్రూట్ ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక వక్షస్థలాన్ని తాకి ఆమె దుస్తులు విప్పడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో భయంతో బాలిక గట్టిగా అరవడంతో.. తల్లి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా దిగువ కోర్టు.. సాక్ష్యాదారాలను పరిశీలించి నిందితుణ్ని పోక్సో చట్టం కింద దోషిగా తేలుస్తూ శిక్షలు విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు బాలిక ఛాతిని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా లేదా దుస్తుల లోపలికి చేయి పెట్టాడా అన్న నిర్దిష్టమైన వివరాలు లేవు కావున… దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేం అని పేర్కొంది.  నాగ్‌పుర్‌ బెంచ్‌కు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలాతో కూడిన ఏక సభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. ఆ కేసులో నిందితుడికి పోక్సో చట్టంలోని సెక్షన్‌ 8(చిన్నారులపై లైంగిక దాడి) కింద మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. అయితే నిందితుడికి ఐపీసీ సెక్షన్‌ 354(ఓ మహిళ గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్‌ 342(దురుద్దేశంతో నిర్బంధించడం) కింద దిగువ కోర్టు విధించిన ఒక ఏడాది కఠిన కారాగార శిక్షను మాత్రం సమర్థించింది.

Also Read: 3 నల్ల త్రాచులు ఒకేసారి ఒకేచోట పడగలు విప్పితే ఎట్టా ఉంటుందో తెలుసా..?

అల్పపీడనం ఎఫెక్ట్‌‌.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో 2 రోజులు స్కూళ్లకు సెలవులు

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?