Central Vista: సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఇద్దరు న్యాయమూర్తులు అనుకూలం.. ఒకరు వ్యతిరేకం..
Central Vista: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Central Vista: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పార్లమెంట్, ప్రధాని, ఉపరాష్ట్రపతి, సచివాలయ భవన సముదాయాల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై పిటిషనర్ అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. డీడీఏ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ధృవీకరించింది. డీడీఏ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టబద్దమైనదే అని జస్టిస్ ఖన్విల్కర్ పేర్కొన్నారు. అయితే త్రిసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు ప్రాజెక్టుకు అనుకూలంగా తీర్పునివ్వగా, మరొక జడ్జి ఆ ప్రాజెక్టును విభేదిస్తూ తీర్పునిచ్చారు. కాగా, డిసెంబర్ 10న సెంట్రల్ విస్టాకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
Also read:
Telangana: విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ… స్త్రీల కోసం ‘స్త్రీ రక్షా ప్యాడ్లు’…