ముంబై పోలీసుల చర్యపై సుప్రీంకోర్టు అసంతృప్తి, సముచితం కాదని మందలింపు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును దర్యాప్తు చేసేందుకు పాట్నా నుంచి ముంబై వచ్చిన పోలీస్ అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఇది తప్పుడు సంకేతాలు పంపుతుందని వ్యాఖ్యానించింది.

ముంబై పోలీసుల చర్యపై సుప్రీంకోర్టు అసంతృప్తి, సముచితం కాదని మందలింపు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును దర్యాప్తు చేసేందుకు పాట్నా నుంచి ముంబై వచ్చిన పోలీస్ అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఇది తప్పుడు సంకేతాలు పంపుతుందని వ్యాఖ్యానించింది. ముంబై పోలీసులకు వృత్తి గతంగా మంచి పేరుందని, కానీ వారిలా చేయడం తగదని అభిప్రాయపడింది. పైగా ఈ కేసుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపింది. ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని  కోరుతూ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాచక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ ని విచారిస్తున్న సందర్భంగా న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించినట్టు కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేయడంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. దీన్ని సీబీకి…. బిహార్ సీఎం నితీష్ కుమార్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదుపై కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన సూచించారు. ఇలా ఉండగా సుశాంత్ బావ గత ఫిబ్రవరిలో తనకు పంపిన వాట్సాప్ మెసేజులను సుశాంత్ ఫ్రెండ్ సిధ్ధార్త్ పితాని విడుదల చేశారు. రియాతో సుశాంత్ డేటింగ్ ని అతని కుటుంబం ఏమాత్రం అంగీకరించలేదని ఈ మెసేజ్ ల ద్వారా తెలుస్తోంది. అటు-సుశాంత్ తండ్రి కేకే ఖాన్ నుంచి తమకు గత ఫిబ్రవరిలో ఎలాంటి ఫిర్యాదు అందలేదని ముంబై పోలీసులు చెబుతున్నారు. అయితే తన కుమారుడికి ప్రాణహాని ఉందని తాను ఫిబ్రవరి 25 న బాంద్రా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, కానీ వారు ఎలాంటి చర్య తీసుకోలేదని ఖాన్ ఆరోపిస్తున్న విషయం విదితమే.

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu