రామ్‌లల్లాకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని
అయోధ్యలోని రామ్‌లల్లాను ప్రధాని మోదీ దర్శించుకున్నారు. రామ్‌లల్లా ఆలయానికి చేరుకున్న మోడీ ముందుగా బాలరాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆయన శ్రీరాముడికి పువ్వులతో పూజ చేశారు...

అయోధ్యలోని రామ్‌లల్లాను ప్రధాని మోదీ దర్శించుకున్నారు. రామ్‌లల్లా ఆలయానికి చేరుకున్న మోడీ ముందుగా బాలరాముడికి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఆయన శ్రీరాముడికి పువ్వులతో పూజ చేశారు. రామ్‌లల్లా విగ్రహమూర్తి చుట్టూ మోడీ ప్రదక్షిణలు చేశారు. ఇక్కడి నుంచి నేరుగా రామాలయ నిర్మాణ స్థలానికి చేరుకున్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలు దేరారు. రోజువారీ వస్త్రధారణకు భిన్నంగా పంచకట్టులో ప్రధాని మోడీ కనిపించారు.
ayodhya bhoomi pooja timeayodhya bhumi pujan timingayodhya decorationayodhya invitation cardayodhya invitation list