రామ‌మందిరం కోసం 28 ఏళ్లు బ్ర‌హ్మ‌చ‌ర్యం.. ఇక ఈ జీవితం రామునికే అంకితం!

అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. రామ మందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది.

రామ‌మందిరం కోసం 28 ఏళ్లు బ్ర‌హ్మ‌చ‌ర్యం.. ఇక ఈ జీవితం రామునికే అంకితం!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 05, 2020 | 2:33 PM

అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. రామ మందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. ఈ క్రమంలో భోపాల్‌కు చెందిన క‌రసేవ‌కుడు రవీంద్ర గుప్తా 28 సంవత్సరాల క్రితం రామాల‌య నిర్మాణాన్ని కాంక్షిస్తూ, క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. రామాల‌య నిర్మాణం ప్రారంభ‌మ‌య్యేంత వ‌ర‌కూ పెళ్లి చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్పుడు రవీంద్ర వయసు 50 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఆయ‌న వివాహం గురించి ఆలోచించడం లేదు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన రవీంద్ర గుప్తాను భోజ్పాలి బాబా అని కూడా పిలుస్తారు. అతను ఇప్పటివరకు నాలుగుసార్లు నర్మద ప్ర‌ద‌క్షిణ చేశారు. రవీంద్ర గుప్తా 22 సంవత్సరాల వయసులో అయోధ్యకు చేరుకున్నారు. ప్రస్తుతం రవీంద్ర గుప్తా బేతుల్‌లో ఉంటున్నారు. రామాల‌య భూమి పూజ సంద‌ర్భంగా ర‌వీంద్ర మాట్లాడుతూ తాను ఆగస్టు 5న శ్రీ‌రామునికి పూజ చేస్తాన‌ని తెలిపారు.ఇక‌పై త‌న జీవిత‌మంతా శ్రీ‌రాముడు, తల్లి నర్మద పూజ‌ల కోస‌మే కేటాయిస్తాన‌ని అన్నారు. తాను 1992లో క‌ర‌సేవ కోసం వెళ్లిన‌ప్పుడు త‌న‌కు 22 సంవత్సరాల‌ని రవీంద్ర గుప్తా తెలిపారు.

Read More:

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్