ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలు దాటిన కరోనా మరణాలు..

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 254,988 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా 6298 మరణాలు సంభవించాయి.

ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలు దాటిన కరోనా మరణాలు..
Follow us

|

Updated on: Aug 05, 2020 | 1:50 PM

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 254,988 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యధికంగా 6298 మరణాలు సంభవించాయి. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అయితే పెరుగుతున్న పాజిటివ్ కేసులతో పాటుగా రికవరీ కేసులు కూడా విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది. ప్రస్తుతం ఉన్న గణాంకాలు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11,936,194 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 18,716,965కి చేరుకుంది. అటు 704,632 మంది కరోనాతో చనిపోయారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(4,918,770), మరణాలు(160,318) సంభవించాయి. ఇక బ్రెజిల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 2,808,076కి చేరుకోగా.. 96 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అటు రష్యాలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాగా, భారత్‌లో కరోనా కేసులు 1,910,681 నమోదు కాగా, మృతుల సంఖ్య 39,856కి చేరింది. అలాగే దక్షిణాఫ్రికా, మెక్సికో దేశాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..