Breaking : సుశాంత్ మరణంపై సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు సిఫారసు చేయాలని బీహార్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించిందని బుధవారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చారు.

Breaking : సుశాంత్  మరణంపై సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 05, 2020 | 1:02 PM

Sushant Singh Rajput’s death case: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు సిఫారసు చేయాలని బీహార్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించిందని బుధవారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చారు. మ‌రోవైపు సుశాంత్ మ‌ర‌ణానికి సంబంధించి త‌న‌పై అభియోగాల‌తో నమోదైన కేసును పాట్నా నుంచి ముంబైకి బ‌దిలీ చేయాల‌ని కోరుతూ రియా చక్రవర్తి వేసిన‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారిస్తోంది. కాగా “నటుడి మరణానికి సంబంధించిన పూర్తి నిజాలు బ‌య‌ట‌కు రావాలి” అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఆరోపణలపై బీహార్ ప్రభుత్వం నిన్న సీబీఐ విచారణకు కేంద్రానికి  సిఫారసు చేసిన విష‌యం తెలిసిందే. సుశాంత్ జూన్ 14 న ముంబైలోని తన బాంద్రా నివాసంలో శవమై కనిపించడంతో దేశం మొత్తం షాక్‌కు గురైంది.

Read More :పిల్లల్ని కనడంపై స్పందించిన అనుష్క శ‌ర్మ‌