Zomato delivery boy case: మహిళ, డెలివరీ బాయ్ తమ, తమ వెర్షన్స్ చెప్పారు.. తాజాగా జొమాటో నుంచి ప్రకటన
బెంగళూరులోని జొమాటో కేసులో ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధితురాలిగా చెప్పుకుంటున్న యువతి, డెలివరీ బాయ్...
బెంగళూరులోని జొమాటో కేసులో ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధితురాలిగా చెప్పుకుంటున్న యువతి, డెలివరీ బాయ్ ఇద్దరూ తమ, తమ వెర్షర్స్ చెప్పుకొచ్చారు. ఇద్దరూ భిన్నమైన వాదనలు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జొమాటో నుంచి కూడా ప్రకటన వచ్చింది. ఈ విషయంపై ఇరువర్గాలు ముందుకు వస్తే, వారిద్దరికీ సాధ్యమైనంత మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది
జొమాటో కోఫౌండర్ మాట్లాడుతూ మేము బాధితురాలి వైద్య ఖర్చులను పరిశీలన జరుపుతున్నాం. మరోవైపు మేము డెలివరీ బాయ్ కామరాజ్‌తో కూడా మాట్లాడుతున్నాం. త్వరలో ఓ సానుకూల నిర్ణయం రావొచ్చు అన్నారు. కాగా కామరాజ్‌ను జొమాటో కొన్ని రోజులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుపై పోలీసు దర్యాప్తు కూడా జరుగుతోంది.
కాగా జొమాటో కోఫౌండర్ మాట్లాడుతూ, కామరాజ్ ఇప్పటివరకు 5000 డెలివరీలను అందించాడని.. 5 రేటింగ్స్‌లో 4.75 యావరేజ్ రేటింగ్ కస్టమర్ల నుంచి అందుకున్నాడని వెల్లడించారు. ఇది ఇప్పటివరకు అత్యధిక జిగా రేటింగ్లలో ఒకటని చెప్పారు. కామరాజ్ 26 నెలలుగా తమతో అసోసియేట్ అయినట్లు తెలిపారు. అంతకుముందు డెలివరీ బాయ్ కామరాజ్ ఈ విషయంపై తన వెర్షన్ వినిపించాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చారు. ఆ మహిళ మొదట తనను దుర్భాషలాడుతూ, చెప్పులతో కొట్టిందని కామరాజ్ చెప్పాడు.
డెలివరీ బాయ్ మాట్లాడుతూ… “నేను ఆమె ఇంటికి వెళ్లాడు. ఆర్డర్ ఇచ్చి.. క్యాష్ ఆన్ డెలివరీ కావడంతో డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు. డెలివరీ ఆలస్యం అయినప్పుడు ఆ మహిళ కోపంతో అరిచింది. నేను సారీ కూడా చెప్పాను. కానీ ఆమె ఆర్డర్ తీసుకుని డబ్బులు ఇవ్వనని మొండికేసింది. జొమాటో చాట్ సపోర్ట్‌తో మాట్లాడుతున్నానని చెప్పింది. నేను డబ్బు ఇవ్వమని అడగడంతో.. సర్వెంట్‌వి, నువ్వు ఏం చేసుకుంటావో, చేస్కో అంటూ పరుష పదుజాలం ఉపయోగించింది. ఈ క్రమంలో జొమాటో సపోర్ట్ వారు ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. ఆ ఫుడ్ వెనక్కి ఇచ్చేయమని కోరాను. దీంతో ఆమె మితిమీరి ప్రవర్తించింది. దీంతో అక్కడ్నుంచి వెనక్కి మళ్లాను. ఆమె నన్ను చెప్పులతో కొట్టడం ప్రారంభించింది. దీంతో నన్ను నేను రక్షించుకునే క్రమంలో చేతులో అడ్డుపెట్టాను. దీంతో ఆమె ఉంగరం తన ముక్కుకే చీరుకోని.. రక్త స్రావమైంది” అని వివరణ ఇచ్చాడు.
Also Read: బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది
భార్య ఫోటో, ఫోన్ నంబర్ ఉన్న పోస్టర్లను ఈ ప్రబుద్దుడు ఊరంతా అంటించాడు.. ఎందుకంటే..?
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు పని చేయవు.. ఎందుకంటే..!