AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny leone: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్‌టికెట్‌ పై నటి సన్నీ లియోన్ న్యూడ్ ఫోటో.. విచారణకు ఆదేశించిన సర్కార్

పరీక్ష రాయడానికి వెళ్లిన ఓ అభ్యర్థి అడ్మిట్ కార్డుపై బాలీవుడ్ నటి సన్నీలియోన్ అడల్ట్ చిత్రాన్ని ముద్రించారు. ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డ్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sunny leone: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్‌టికెట్‌ పై నటి సన్నీ లియోన్ న్యూడ్ ఫోటో.. విచారణకు ఆదేశించిన సర్కార్
Sunny Leone
Sanjay Kasula
|

Updated on: Nov 09, 2022 | 1:20 PM

Share

కర్ణాటక టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో చాలా విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. పరీక్ష రాయడానికి వెళ్లిన ఓ అభ్యర్థి అడ్మిట్ కార్డుపై బాలీవుడ్ నటి సన్నీలియోన్ అడల్ట్ చిత్రాన్ని ముద్రించారు. ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డ్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. కర్ణాటక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2022 అడ్మిట్ కార్డ్‌లో విద్యార్థి ఫోటో స్థానంలో సన్నీ లియోన్ చిత్రం ఉండటంతో కర్ణాటక విద్యా శాఖ పోలీసు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై శివమొగ్గ సైబర్‌ విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు పరీక్షా కేంద్రం ఇన్‌చార్జి చన్నప్ప సీఈఎన్ పోలీస్ స్టేషన్‌లో కర్నాటక విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు శివమొగ్గ ఎస్పీ మిథున్ కుమార్ జీకే మీడియాకు తెలిపారు. అభ్యర్థి చిక్‌మగళూరు జిల్లా కొప్పాకు చెందిన అభ్యర్థిగా గుర్తించారు. శివమొగ్గలో ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోని.. ఆదివారం పరీక్షకు కూడా హాజరయ్యాడు. పరీక్షకు హాజరయ్యేందుకు సైబర్ సెంటర్ నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర విద్యాశాఖపై కాంగ్రెస్ ఆరోపణలు..

అయితే ఇదే కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్‌పర్సన్ BR నాయుడు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఉద్దేశించిన అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ అభ్యర్థి ఫొటోకు బదులు మాజీ అడల్ట్ స్టార్ చిత్రాన్ని హాల్ టికెట్‌పై ముద్రించిందని ఆరోపించారు.

నాయుడు ఆరోపణలపై స్పందిస్తూ కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో “అభ్యర్థి ఫోటోను అప్‌లోడ్ చేయాలి. కానీ సిస్టమ్‌లో అప్‌లోడ్ చేస్తున్నప్పుడు ఏ ఫోటోను అప్‌లోడ్ చేస్తే అదే ఫోటో తీసుకుంటుంది. మీ అడ్మిట్ కార్డ్‌లో సన్నీ లియోన్ ఫోటో పెట్టారా అని అధికారులు అభ్యర్థిని అడిగినప్పుడు, ఆమె భర్త స్నేహితుడు అప్‌లోడ్ చేశాడని ఆమె తెలిపింది.”అయితే ఈ ఘటనపై ఇప్పుడు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నవంబర్ 6వ తేదీన పరీక్ష నిర్వహించారు. కర్ణాటకలోని 781 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 3,32,913 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వ విద్యాశాఖ వివరణ ఇస్తూ.. ‘‘తప్పు ప్రభుత్వం వైపు నుంచి కానీ, విద్యాశాఖ వైపు నుంచి కానీ జరగలేదు’’ అని పేర్కొంది. అయితే దీనిపై విచారణ జరిపిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కర్ణాటక విద్యాశాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం