Summer Holidays: పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు.. వివరాలు ఇవిగో.!
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించింది ఆ రాష్ట్ర విద్యాశాఖ.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించింది ఆ రాష్ట్ర విద్యాశాఖ. వాస్తవానికి అక్కడి స్కూల్స్ అన్నీ కూడా జూన్ 1 నుంచి పున:ప్రారంభం కావాల్సి ఉండగా.. భానుడి భగభగలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో.. విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరో ఆరు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు ఇటీవల ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ప్రకటించారు. దీంతో జూన్ 7వ తేదీ నుంచి పాఠశాలల్ని తిరిగి పునఃప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న 127 ప్రభుత్వ స్కూళ్లల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేసేందుకు అనుమతులు లభించాయని.. దీన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి వర్తించేలా చేస్తామన్నారు. అలాగే సీబీఎస్‌ఈ పాఠ్యపుస్తకాలను.. స్కూల్స్ రీ-ఓపెన్ జరిగిన రోజే విద్యార్ధులకు అందజేస్తామన్నారు. ఇప్పటికే ఉచిత యూనిఫారం, సైకిళ్ల పంపిణీ జరిగిందన్నారు. మరో నెలలో ల్యాప్‌ట్యాప్‌లు కూడా పంపిణీ చేస్తామని వెల్లడించారు. కాగా, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.