Sukesh Chandrasekhar: సుఖేశ్, జాక్వెలిన్ ఫేస్ టు ఫేస్ విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు..
మనీలాండరింగ్ కేసులో మాయగాడు సుఖేశ్ చంద్రశేఖర్ , నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఢిల్లీ కోర్టులో ఫేస్ టూ ఫేస్ విచారించారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న జాక్వెలిన్ పిటిషన్‌పై ఈనెల 23న విచారణ జరుగుతుంది.
మనీలాండరింగ్ కేసులో మాయగాడు సుఖేశ్ చంద్రశేఖర్ , నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఢిల్లీ కోర్టులో ఫేస్ టూ ఫేస్ విచారించారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న జాక్వెలిన్ పిటిషన్‌పై ఈనెల 23న విచారణ జరుగుతుంది. తీహార్ జైల్లో ఉన్న మాయగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల వసూళ్ల కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో సుఖేశ్ చంద్రశేఖర్‌ను హాజరపర్చారు పోలీసులు.
గట్టి భద్రత మధ్య సుఖేశ్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో కలిపి సుఖేశ్‌ను కోర్టులో తొలిసారి విచారించారు. జాక్వెలిన్‌కు విలువైన బహమతులు ఇచ్చినట్టు గతంలో విచారణలో వెల్లడించాడు సుఖేశ్. ఆమ్‌ఆద్మీకి పార్టీకి తాను రూ. 60 కోట్ల నిధులు ఇచ్చినట్టు సంచలన ఆరోపణలు చేశారు. దర్యాప్తు కమిటీ సుఖేష్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.
ఈ వ్యవహారంలో సుఖేశ్‌తో పాటు జాక్వెలిన్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదయ్యింది. మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు జాక్వెలిన్. తన కుటుంబసభ్యులు బహ్రెయిన్‌లో ఉన్నారని.. వారిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 23కు కోర్టు వాయిదా వేసింది. . ఈలోపు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సూచించింది. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..