అయ్యో.. స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని పనిష్మెంట్.. గుంజీలు తీస్తూ కుప్పకూలి..
స్కూల్‌కు లేట్‌గా వస్తే టీచర్స్ ఇచ్చే పనిష్‌మెంట్ ఏంటి.. కాసేపు బటయ నిల్చో పెట్టడమో లేదా, గోడ కుర్చీలు వేయించమో చేస్తారు. కానీ ఇక్కడో టీచర్ మాత్రం పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడనే.. ఓ విద్యార్థినికి ఏకంగా 100 గుంజీల తీయాలనే పనీష్‌మెంట్ ఇచ్చింది.. పాపం ఆ పనీష్‌మెంట్ పూర్తయ్యేలోపే.. ఆ విద్యార్థిని ప్రాణాలు కూడా కోల్పోయింది. ఈ విషాద ఘటన పాల్ఘర్ జిల్లాలో వెలుగు చూసింది.

స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ తట్టుకోలేక ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ నెల 8న చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విద్యార్థికి పనీష్మెంట్ ఇచ్చిన ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్ఘర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ స్కూల్‌కు లేట్‌గా వచ్చాడు. దీంతో ఆగ్రహించిన టీచర్.. ఆ విద్యార్థినికి పనీష్మెంట్‌గా 100 గుంజీలు తీయాలని బలవంతం చేసింది.
అయితే సదురు విద్యార్థిని అప్పటికే అనారోగ్యంతో బాధపడుతుంది. కానీ ఇక చేసేదేమి లేక.. టీచర్ చెప్పినట్టు గుంజీలు తీయండం ప్రారంభించింది.. కానీ ఆవి పూర్తయ్యూలోపే అస్వస్థతకు గురై ఆ బాలిక కిందపడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది బాలికను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు బాలికకు వైద్యం అందించారు. ఈ క్రమంలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే బాలిక ప్రాణాలు కోల్పోయింది.
అయితే బాలిక వీపుపై బ్యాగును అలానే పెట్టి టీచర్స్ గుంజీలు తీయించారని బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది. తన కుమార్తె మరణానికి స్కూట్ టీచరే కారణమని.. బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. సమాచారంతో ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో తాజాగా బాలిక మృతికి కారణమైన టీచర్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
