కసబ్ చేతికున్న ఆ “ఎర్రదారం” కథ వింటే షాక్.. ఆ కుట్రలోనే భాగమట..!!

నవంబర్ 26.. ఈ తేదీ వింటే చాలు.. ముంబై మారణ హోమం గుర్తుకురాక మానదు. దేశచరిత్రలోనే అత్యంత భయానమైన ఉగ్రదాడి అది. దాదాపు పన్నెండేళ్ల క్రితం.. దేశ ఆర్థిక రాజధానిలో మారణహోమం సృష్టించి అనేక మంది ప్రాణాలను తీశారు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు. ముంబై తీరం వెంట ఎంటరైన 10 మంది ఉగ్రవాదులు.. విచక్షణారహితంగా చేసిన దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఉగ్రదాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులు.. […]

కసబ్ చేతికున్న ఆ ఎర్రదారం కథ వింటే షాక్.. ఆ కుట్రలోనే భాగమట..!!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 19, 2020 | 6:14 AM

నవంబర్ 26.. ఈ తేదీ వింటే చాలు.. ముంబై మారణ హోమం గుర్తుకురాక మానదు. దేశచరిత్రలోనే అత్యంత భయానమైన ఉగ్రదాడి అది. దాదాపు పన్నెండేళ్ల క్రితం.. దేశ ఆర్థిక రాజధానిలో మారణహోమం సృష్టించి అనేక మంది ప్రాణాలను తీశారు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు. ముంబై తీరం వెంట ఎంటరైన 10 మంది ఉగ్రవాదులు.. విచక్షణారహితంగా చేసిన దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఉగ్రదాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులు.. మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్‌ను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. కసబ్ పక్కా పాకీస్థానీ ముస్లిం. అతిచిన్న వయస్సులోనే ఉగ్రవాదానికి ప్రేరేపితుడయ్యాడు. అయితే ఇతడు సజీవంగా పట్టుబడటం.. ఎన్నో నిజాలను తెలిసేలా చేసింది. పాక్ కుట్రలను విచారణలో తెలుసుకోగలిగారు మన అధికారులు. ముఖ్యంగా ముంబై ఘటనను హిందు ఉగ్రవాద చర్యగా చిత్రీకరించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయట. ఇందుకు లష్కరే తోయిబా అనేక ప్రయత్నాలు చేసిందని తెలిసింది.

ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ మారియా.. ‘లెట్‌ మీ సే ఇట్‌ నౌ’ పేరిట రచించిన పుస్తకంలో ఈ వివరాలను పూర్తిగా వెల్లడించారు. ఈ పుస్తకాన్ని సోమవారం విడుదల చేశారు. ముంబై ఉగ్రదాడులపై తాను సాగించిన దర్యాప్తునకు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఉగ్రవాదుల పేర్లను మార్చి, భారతీయ చిరునామాలపై నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించారని తెలిపారు. ఈ ఉగ్ర దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాది మొహమ్మద్‌ అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ను బెంగళూరుకు చెందిన వాడిగా గుర్తింపు కార్డు సృష్టించారని. .ఇందులో కసబ్ పేరు సమీర్‌ ఛౌదరిగా పేర్కొన్నారని మారియా తన పుస్తకంలో వెల్లడించారు. అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే అతడు సమీర్‌ చౌదరిగానే మరణిస్తే.. అప్పుడు కసబ్ చేతికి ఉన్న ఎర్రదారం ఆధారంగా.. ఈ దాడిని హిందూ ఉగ్రవాదంగా చిత్రీకరిస్తే.. అటు మీడియా కూడా దాన్ని హిందూ ఉగ్రవాద చర్యగా భావిస్తుందని లష్కరే తాయిబా కుట్ర పన్నినట్లు తెలిపారు. అందులో భాగంగానే కసబ్‌ చేతికి హిందువులు ధరించే ఎర్ర రంగు కంకణం కట్టారని పేర్కొన్నారు.

ఇలా చేస్తే.. ఈ ఘటనను హిందూ టెర్రర్‌గా నమ్మించే ప్రయత్నం చేయోచ్చని ప్లాన్ వేశారనన్నారు. హిందూ ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని మీడియా సంస్థలు కూడా అదే పనిగా పెద్ద పెద్ద డిబేట్‌లు పెట్టేందుకు రెడీ అవుతాయని.. అంతా బెంగళూరు వైపు చూస్తారని లష్కరే తోయిబా ప్లాన్ వేసింది. అయితే కసబ్ సజీవంగా పట్టుబడటంతో.. లష్కరే తోయిబా కుట్రలు ఫెయిల్ అయ్యాయి. కసబ్‌ పాకిస్థాన్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందినవాడిగా తేలిందని వివరించారు. అయితే కసబ్‌ సజీవంగా పట్టుబడడంతో.. పోలీసులకు తమకు సంబంధించిన వివారాలు చెప్తాడన్న కారణంతో.. జైల్లోనే కసబ్‌ను హతమార్చేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా ప్రయత్నాలు కూడా చేసినట్లు మారియా వెల్లడించారు. కసబ్‌ను హతమార్చే పనిని దావూద్‌ గ్యాంగ్‌కు అప్పగించినట్లు తెలిపారు. కాగా.. కసబ్ దొంగతనాలు చేసేందుకు ఈ ఉగ్ర సంస్థలో చేరాడని.. తొలుత జీహాద్‌తో అతడికి సంబంధం లేదని తెలిపారు. అయితే భారత్‌లో ముస్లింలను నమాజ్‌ చేసుకునేందుకు కూడా అనుమతించరని అతడిని మైండ్ వాష్ చేసి నమ్మించారని.. మెట్రో సినిమా థియేటర్‌ సమీపంలోని మసీదులో కసబ్‌ను ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించినప్పుడు అతడు షాక్‌కు గురయ్యాడని మరియా తన పుస్తకంలో వెల్లడించారు. మొత్తానికి కసబ్ సజీవంగా పట్టుబడటం లష్కరే తొయిబాకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది.