‘ఎస్..ఇండియాకు వెళ్తున్నా.. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది’.. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను త్వరలో జరపబోయే భారత పర్యటన పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని తహతహలాడుతున్నారు. ఇండియాలో ఢిల్లీ సందర్శన అనంతరం అహ్మదాబాద్ లోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోడీతో బాటు సంయుక్త సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ సందర్భంగా ఆ సిటీలో తనకు సుమారు 70 లక్షల మంది ప్రజలు ఘనంగా స్వాగతం చెప్పడానికి సిధ్ధంగా ఉన్నారని తెలిసి అప్పుడే ఆనందం పట్టలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ఆయన […]
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను త్వరలో జరపబోయే భారత పర్యటన పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని తహతహలాడుతున్నారు. ఇండియాలో ఢిల్లీ సందర్శన అనంతరం అహ్మదాబాద్ లోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోడీతో బాటు సంయుక్త సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ సందర్భంగా ఆ సిటీలో తనకు సుమారు 70 లక్షల మంది ప్రజలు ఘనంగా స్వాగతం చెప్పడానికి సిధ్ధంగా ఉన్నారని తెలిసి అప్పుడే ఆనందం పట్టలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ఆయన వాషింగ్టన్ లోని జాయింట్ బేస్ ఏండ్రుస్ లో తనను కలిసిన మీడియాకు తెలిపారు. ఈ సారి తను జరపబోయే భారత పర్యటన విశిష్టంగా ఉండగలదని, ఈ పర్యటనతో మోడీతో తన స్నేహం, అమెరికా-భారత ప్రజలమధ్య సాన్నిహిత్యం మరింత దృఢపడుతుందని విశ్వసిస్తున్నానని ట్రంప్ చెప్పారు. గతంలో మూడు, నాలుగు సార్లు మోడీ, ట్రంప్ మధ్య సమావేశాలు జరిగినా.. ఈ భేటీకి అటు వైట్ హౌస్ కూడా విశేష ప్రాధాన్యమిస్తోంది.