AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇండియాతో వాణిజ్య ఒప్పందమా ? ఇప్పట్లో లేనట్టే’…

ఇండియాతో అతి ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని ఇప్పట్లో కుదుర్చుకునే అవకాశాలు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నవంబరులో తమ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయని, ఆ లోగా భారత్ తో డీల్ కుదరకపోవచ్ఛునని ఆయన చెప్పారు. ఈ నెల 24-25 తేదీల్లో ట్రంప్ ఇండియాను సందర్శించనున్నారు. ఆయన రాక సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య కోట్లాది డాలర్ల విలువైన భారీ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికలు […]

'ఇండియాతో వాణిజ్య ఒప్పందమా ? ఇప్పట్లో లేనట్టే'...
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 19, 2020 | 11:36 AM

Share

ఇండియాతో అతి ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని ఇప్పట్లో కుదుర్చుకునే అవకాశాలు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నవంబరులో తమ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయని, ఆ లోగా భారత్ తో డీల్ కుదరకపోవచ్ఛునని ఆయన చెప్పారు. ఈ నెల 24-25 తేదీల్లో ట్రంప్ ఇండియాను సందర్శించనున్నారు. ఆయన రాక సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య కోట్లాది డాలర్ల విలువైన భారీ ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికలు జరిగే లోగా ఈ ప్రక్రియ జరుగుతుందా అన్న విషయం తాను చెప్పలేనని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల అనంతరమే ఇందుకు అవకాశాలు ఉన్నాయని, కానీ డీల్ తప్పకుండా కుదుర్చుకుంటామని అన్నారు. మంగళవారం వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఉభయ దేశాల మధ్య గల వాణిజ్య సంబంధాల పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఈ విషయంలో ఇండియా తమను దాదాపు నిర్లక్ష్యం చేస్తోందని అభిప్రాయపడ్డారు. ‘వుయ్ ఆర్ నాట్ ట్రీటెడ్ వెల్ బై ఇండియా’ అని వ్యాఖ్యానించారు. అయితే ప్రధాని మోదీని ప్రశంసిస్తూ.. ఆయనను కలుసుకునేందుకు తహతహలాడుతున్నానని తెలిపారు.

ఢిల్లీలో మోదీని, ఇతర మంత్రులను కలిసిన అనంతరం తామిద్దరం అహ్మదాబాద్ వెళ్తామని, అక్కడ భారీ స్టేడియంలో  ప్రసంగించనున్నామని చెప్పిన ఆయన.. విమానాశ్రయానికి, ఈ స్టేడియానికి మధ్య సుమారు 70 లక్షలమంది ప్రజలు తనను ఆహ్వానం పలుకుతారని మోడీ చెప్పారని వెల్లడించారు. ఆ స్టేడియం ఇంకా నిర్మాణ దశలో ఉందని, ప్రపంచంలో అది అతి పెద్ద స్టేడియం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదెంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంది. మీరంతా కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను అని ఆయన చెప్పారు.

Follow Us
రేషన్ బియ్యంతో చెక్క గారెలు.. ఎగబడి తినేస్తారు మీ పిల్లలు
రేషన్ బియ్యంతో చెక్క గారెలు.. ఎగబడి తినేస్తారు మీ పిల్లలు
ఢిల్లీ నిరసనల్లో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు..!
ఢిల్లీ నిరసనల్లో పాకిస్తాన్ కుట్ర బట్టబయలు..!
ఆధార్ కార్డు వాడేవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..
ఆధార్ కార్డు వాడేవారందరూ ఈ పని చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత
వంటింటి ఔషధం.. ఈ ఆకులు 2 నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు
వంటింటి ఔషధం.. ఈ ఆకులు 2 నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు
జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది..
జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది..
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం రూ.500 సబ్సిడీ.. అసలు లెక్కలు ఇవే..
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం రూ.500 సబ్సిడీ.. అసలు లెక్కలు ఇవే..
లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు..!
లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు..!
రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. ప్రభుత్వ అధికారి మృతి కలకలం!
రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. ప్రభుత్వ అధికారి మృతి కలకలం!