ఓ చిన్న దుకాణం నడిపిస్తున్న వ్యక్తికి రూ.12.23 కోట్లు కట్టాలంటూ ఐటీ అధికారుల నోటీసులు..షాకింగ్ లో యజమాని
కొంతమంది కేటుగాళ్లు కొందరి వ్యక్తిగత వివరాలు సేకరించి వాటిని దుర్వినియోగం చేయడం లాంటి ఘటనలు ఇటీవల పెరిపోతున్నాయి. అయితే తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ దుకాణం నడిపిస్తున్న వ్యక్తికి ఐటీ అధికారులు రూ. 12.23 కోట్లు కట్టాలని నోటీసులు జారీచేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.

కొంతమంది కేటుగాళ్లు కొందరి వ్యక్తిగత వివరాలు సేకరించి వాటిని దుర్వినియోగం చేయడం లాంటి ఘటనలు ఇటీవల పెరిపోతున్నాయి. అయితే తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ దుకాణం నడిపిస్తున్న వ్యక్తికి ఐటీ అధికారులు రూ. 12.23 కోట్లు కట్టాలని నోటీసులు జారీచేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ బిల్వార పట్టణంలో ఉంటున్న కిషన్ గోపాల్ చపర్వాల్ అనే వ్యక్తి ఓ స్టేషనరీ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే అతను వికలాంగుడు కూడా. అయితే మార్చి 28న అతని ఇంటికి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఓ షో కాస్ నోటిసు వచ్చింది. అలాగే అందులో అతను రూ.12.23 కోట్లు చెల్లించాలని ఉంది. ఇది చూసిన కిషాన్ గోపాల్, అతని కుటుంబ సభ్యలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
వాస్తవానికి ఈ నోటీసులకు అతనికి ఏం సంబంధం లేదు. ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు కిషాన్ గోపాల్ ఓ చార్టెట్ అకౌంటెంట్ వద్దకు వెళ్లాడు. అయితే కిషాన్ గోపాల్ పాన్ కార్డును కొంతమంది దుర్వినియోగం చేశారని.. ముంబయి, సూరత్ లలో రెండు డైమండ్ షెల్ కంపెనీలు పెట్టి కోట్లల్లో బోగస్ లావదేవీలు జరిపించడానికి అతని పాన్ కార్డును వాడుకున్నారని ఆ చార్టెట్ అకౌంటెంట్ తెలిపాడు. ఇది కిషాన్ గోపాల్ కంగుతిన్నాడు. ఐటీ అధికారుల పంపిన నోటీస్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కార్డు నంబర్లు ఎవరు వాడుకున్నారో తెలియదని.. ఈ విషయంలో నుంచి తనకు ఉపశమనం కల్పించాలని కోరాడు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కిషాన్ గోపాల్ లోన్ తీసుకున్న తర్వాత దుకాణాన్ని పెట్టానని.. ఆ లోన్లు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానని వాపోయారు. తాను నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే సంపాదిస్తున్నానని తెలిపాడు. కొంతమంది కేటుగాళ్లు తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.




మరిన్ని జాతీయ వార్తలు చదవండి
