AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay Arrest: బండి సంజయ్‌కు జైల్లో పెట్టిన ఆహారం ఇదే.. సాధారణ ఖైదీలతో సమానంగా..

పదవ తరగతి హిందీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్‌ను కరీంనగర్ జిల్లా జైల్లో ఉంచారు. నిన్న రాత్రి నుంచి కరీంనగర్ జైల్లోనే ఆయన్ను ఉంచిన పోలీసులు.. ఆయనకు సాధారణ ఖైదీలకు ఇచ్చే భోజనం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Bandi Sanjay Arrest: బండి సంజయ్‌కు జైల్లో పెట్టిన ఆహారం ఇదే.. సాధారణ ఖైదీలతో సమానంగా..
Bandi Sanjay Kumar
Shiva Prajapati
|

Updated on: Apr 06, 2023 | 1:15 PM

Share

పదవ తరగతి హిందీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్‌ను కరీంనగర్ జిల్లా జైల్లో ఉంచారు. నిన్న రాత్రి నుంచి కరీంనగర్ జైల్లోనే ఆయన్ను ఉంచిన పోలీసులు.. ఆయనకు సాధారణ ఖైదీలకు ఇచ్చే భోజనం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉదయం పూట ఇడ్లీ, మధ్యాహ్నం అన్నంతో పాటు పప్పు టమోటా, రసం ఇచ్చారు. అంతేకాదు.. ఎలాంటి టెస్ట్ చేయకుండానే ఆయనకు ఆహారం ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్ తరఫున న్యాయవాదులు. అయితే, బండి సంజయ్‌కు ఆహారం విషయంలో కోర్టు నుంచి తమకు ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు రాలేదంటున్నారు పోలీసులు. దాంతో అందరు ఖైదీలు మాదిరిగానే ఆయనకూ సాధారణ భోజనం అందించామని చెబుతున్నారు జైలు అధికారులు.

ఇదిలాఉంటే.. హనుమకొండ కోర్టు ఇచ్చిన డాకెట్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, తక్షణమే బండి సంజయ్‌ని విడుదల చేయాలని కోరుతూ ఆయన తరుఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ సమయంలో పోలీసులు 41-ఎ నోటీస్ ఇవ్వలేదన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వేధింపులకు గురిచేయాలనే ఉద్దేశంతో కిలోమీటర్ల కొద్ది సంజయ్‌ని తిప్పారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. వరంగల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని అన్నారు. బీజేపీపై కుట్రలో భాగంగానే కేసులో ఇరికించారని, రిమాండ్ రిపోర్టులో సైతం నేరం చేసినట్టు ఎక్కడా పొందపర్చలేదన్నారు. అరెస్టు సమయంలో పోలీసులు సీఆర్పీసీ 50 నిబంధనలను పాటించలేదని పిటిషన్ లో ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్