నేడే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ, సోనియా రాజీనామా ప్రకటన ?
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాయక సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం జరగనుంది. కీలకమైన ఈ సమావేశంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన రాజీనామాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాయక సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం జరగనుంది. కీలకమైన ఈ సమావేశంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన రాజీనామాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే సమావేశం మొదలైన వెంటనే ఆమె తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక నేతలందరి అభిప్రాయాలను విన్న తరువాతా అన్నది తేలాల్సి ఉంది. అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు రాహుల్, సోనియా ఇద్దరూ విముఖంగా ఉండడంతో ఇక పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరవుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటూ 20 మందికి పైగా సీనియర్ నేతలు సోనియాకు రాసిన లేఖతో ఈ అనూహ్య పరిణామం తలెత్తింది. వారు ఈనెల 7 నే ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.