వాళ్ళు మన దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకలు.. సోనియా

వలస కూలీల రైల్వే ప్రయాణ ఖర్చులను తామే భరిస్తామన్న కాంగ్రెస్ అధినేత్రి… వారిని మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా భావిస్తామన్నారు.  1947 లో దేశ విభజన తరువాత ఇంత పెద్ద విషాదం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారని చెప్పిన ఆమె.. లాక్ డౌన్ కాలంలో లక్షలాది వేతన జీవులు రోజూ తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు కాలినడకన వందలాది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారని పేర్కొన్నారు. అయితే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వీరిపట్ల ఇంత ఉదారత చూపడం వెనుక […]

  • Publish Date - 11:31 am, Mon, 4 May 20 Edited By: Anil kumar poka
వాళ్ళు  మన దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకలు.. సోనియా

వలస కూలీల రైల్వే ప్రయాణ ఖర్చులను తామే భరిస్తామన్న కాంగ్రెస్ అధినేత్రి… వారిని మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా భావిస్తామన్నారు.  1947 లో దేశ విభజన తరువాత ఇంత పెద్ద విషాదం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారని చెప్పిన ఆమె.. లాక్ డౌన్ కాలంలో లక్షలాది వేతన జీవులు రోజూ తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు కాలినడకన వందలాది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారని పేర్కొన్నారు. అయితే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వీరిపట్ల ఇంత ఉదారత చూపడం వెనుక మతలబు ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది. ఈ కరోనా కాలంలో ఇదో పెద్ద రాజకీయ దుమారం రేపినా రేపవచ్చు. ఇప్పటివరకు వ్యవసాయకూలీలు, నిర్మాణ రంగ కార్మికుల పట్ల ఈ పార్టీ పెద్దగా.. ఇంతగా స్పందించింది లేదు..

 

 

sonia gandhi on migrant workers