పోలీస్ స్టేషన్ లో గానా బజానా.. డ్యాన్స్.. ఎందుకంటే ?

పోలీస్ స్టేషన్ లో గానా బజానా.. డ్యాన్స్.. ఎందుకంటే ?

ఉత్తరప్రదేశ్ లోని ఎటావా జిల్లాలో జరిగిన విచిత్ర ఉదంతం చూస్తే మన పోలీసులు ఎంత ఆర్టిస్టులు కూడా అని ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే. అక్కడి పోలీసు స్టేషన్ లో ఖాకీలు ఓ యువకుడి చేత బలవంతంగా డ్యాన్స్ చేయించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది...

Umakanth Rao

| Edited By: Anil kumar poka

May 04, 2020 | 10:37 AM

ఉత్తరప్రదేశ్ లోని ఎటావా జిల్లాలో జరిగిన విచిత్ర ఉదంతం చూస్తే మన పోలీసులు ఎంత ఆర్టిస్టులు కూడా అని ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే. అక్కడి పోలీసు స్టేషన్ లో ఖాకీలు ఓ యువకుడి చేత బలవంతంగా డ్యాన్స్ చేయించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. హర్యానా స్టార్ సప్నా చౌదరి ఇఛ్చిన ఓ పర్ఫార్ఫెమ్స్ కి ఆ యువకుడు డ్యాన్స్ చేస్తుండగా కుర్చీలో కూర్చుని హుందాగా ఎంజాయ్ చేస్తున్న పోలీసు అధికారి.. వీళ్లకు ట్రైనింగ్ లో ఇలాంటి ‘ఆర్టిస్టిక్’ వినోద కాలక్షేపానికి కూడా అవకాశం ఇస్తున్నారా అనిపిస్తోంది. ఆ అధికారికి తోడు మరో ఇద్దరు పోలీసులు కూడా ఆ యువకుడిని ప్రోత్సహిస్తున్నట్టుగా సైగలు చేయడం విశేషం. ఇంతకీ ఆ వ్యక్తి చేత ఖాకీలు ఎందుకిలా డ్యాన్స్ చేయించారో ఈ తెలియలేదు. అయితే బహుశా లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు శిక్షగా ఇందుకు వాళ్ళు ఆదేశించి ఉండవచ్చునని తెలుస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu