లాక్‌డౌన్ ఎత్తివేత !..సరి బేసి రోజుల్లో షాపుల‌కు అనుమ‌తి ?

లాక్‌డౌన్‌ ను సుదీర్ఘ కాలం కొనసాగించడం సాధ్యంకాదంటూ స్వ‌యంగా అక్క‌డి ముఖ్య‌మంత్రే ప్ర‌క‌టించారు. దీని వల్ల ఆదాయం దారుణంగా పడిపోయిందన్నారు. అయితే లాక్ డౌన్ వల్ల సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు.

లాక్‌డౌన్ ఎత్తివేత !..సరి బేసి రోజుల్లో షాపుల‌కు అనుమ‌తి ?
Follow us

|

Updated on: May 04, 2020 | 12:34 PM

కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఎత్తి వేయటానికి కొన్ని రాష్ట్రాలు ససేమిరా అంటుంటే.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఎప్పుడెప్పుడా? అన్నట్లు ఎదురుచూస్తున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తి వేస్తే వైరస్ వ్యాప్తి జోరు మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నా.. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటామే తప్పించి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాళం వేసి ఉంచే పరిస్థితి మాత్రం లేదంటున్నారు. తాజాగా ఇలాంటి మాటల్నే చెప్పుకొచ్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
ఢిల్లీలో లాక్ డౌన్ ఎత్తివేతకు సిద్ధంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ను సుదీర్ఘ కాలం కొనసాగించడం సాధ్యంకాదన్న ఆయన దీని వల్ల ఆదాయం దారుణంగా పడిపోయిందన్నారు. అయితే లాక్ డౌన్ వల్ల సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఇక ఢిల్లీని తెరిచే సమయం ఆసన్నమైందన్న ఆయన కరోనా వైరస్ తో కలిసి జీవించేందుకు ప్రజలు సిద్ధపడాలన్నారు. కంటైన్మెంట్‌ జోన్లను పూర్తిగా మూసివేస్తామని, ఇతర ప్రాంతాలను గ్రీన్‌జోన్లుగా ప్రకటించి సరి బేసి రోజుల్లో షాపులను తెరిపించేందుకు ఏర్పాట్లు చేపట్టామని ఆయన లాక్ డౌన్ ఎత్తివేత వ్యూహాలను వివరించారు.