గ్రీన్ జోన్లలో బస్సులు నడవవు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సుల పునరుద్దరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రీన్ జోన్లు పెరిగాక ఆర్టీసీ బస్సు సర్వీసులపై నిర్ణయం తీసుకుంటామని జగన్ సర్కార్ తెలిపింది. మూడోదశ లాక్ డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సులు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలోని ఏకైక గ్రీన్ జోన్ విజయనగరం జిల్లాలో బస్సులు నడిపేందుకు అవకాశం లభించింది. అయితే ఆ ఒక్క జిల్లాలో సర్వీసుల పునరుద్దరణ ప్రస్తుతానికి […]

గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సుల పునరుద్దరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రీన్ జోన్లు పెరిగాక ఆర్టీసీ బస్సు సర్వీసులపై నిర్ణయం తీసుకుంటామని జగన్ సర్కార్ తెలిపింది. మూడోదశ లాక్ డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సులు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలోని ఏకైక గ్రీన్ జోన్ విజయనగరం జిల్లాలో బస్సులు నడిపేందుకు అవకాశం లభించింది.
అయితే ఆ ఒక్క జిల్లాలో సర్వీసుల పునరుద్దరణ ప్రస్తుతానికి వద్దని.. వారం తర్వాత మరిన్ని జిల్లాలు గ్రీన్ జోన్లలోకి చేరిన తర్వాత బస్సు సర్వీసులను పునరుద్దరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.
Read More:
తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్..?
జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..
నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అంతలోనే బ్యాడ్ న్యూస్..
వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 3.0.. తెరుచుకునేవి ఇవే..
‘కరోనా’ జంతువును మన దేశంలోనూ తింటారట.. ఎక్కడో తెలుసా.!