మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అంతలోనే బ్యాడ్ న్యూస్..

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అంతలోనే బ్యాడ్ న్యూస్..

లాక్ డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు ఇవాళ్టి నుంచి తెరుచుకోవడంతో మందుబాబులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ తరుణంలో వారికి ఓ బ్యాడ్ న్యూస్. ఇక నుంచి మద్యంపై ‘కోవిడ్ సెస్’ విధించేందుకు ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే నాగాలాండ్‌లో పెట్రోల్, డీజిల్‌పై కరోనా ట్యాక్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఏపీ ప్రభుత్వం కూడా మద్యం ధరలను 25 శాతం పెంచేసింది. ఇదే కోవలో హర్యానా సర్కార్ మద్యంపై కరోనా సెస్ విధించే అవకాశాలు […]

Ravi Kiran

|

May 04, 2020 | 12:21 PM

లాక్ డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు ఇవాళ్టి నుంచి తెరుచుకోవడంతో మందుబాబులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ తరుణంలో వారికి ఓ బ్యాడ్ న్యూస్. ఇక నుంచి మద్యంపై ‘కోవిడ్ సెస్’ విధించేందుకు ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే నాగాలాండ్‌లో పెట్రోల్, డీజిల్‌పై కరోనా ట్యాక్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఏపీ ప్రభుత్వం కూడా మద్యం ధరలను 25 శాతం పెంచేసింది. ఇదే కోవలో హర్యానా సర్కార్ మద్యంపై కరోనా సెస్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా వెల్లడించారు.

కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని.. నెలకు సుమారుగా రూ. 6000 కోట్లు ఆదాయాన్ని కోల్పోయిందని తెలిపారు. అటు ఎన్నో రంగాలు ఈ మహమ్మారి వల్ల నష్టపోయాయని చెప్పిన ఆయన.. ఇలా మద్యంపై విధించే కరోనా సెస్ ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని మళ్ళీ గాడిలో పెట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. రూ.2 నుంచి రూ.20 వరకు కరోనా సెస్ విధించే అవకాశాలు ఉన్నట్టు ఆయన అన్నారు. కాగా, హర్యానా కోవలోనే మరిన్ని రాష్ట్రాలు కూడా మద్యంపై కరోనా సెస్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More: 

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్‌..?

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..

‘కరోనా’ జంతువును మన దేశంలోనూ తింటారట.. ఎక్కడో తెలుసా.!

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. దేశంలో కరోనా కేసులు ఎన్నంటే…

ఇదెక్కడి విచిత్రం.. మద్యం షాపుకు కొబ్బరికాయ కొట్టి పూజలు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu