31 రాష్ట్రాల్లో సడలింపులు..బిజీబిజీగా బీచ్‌లు, రెస్టారెంట్లు
దాదాపు 31 రాష్ట్రాల్లో తిరిగి కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాక్‌డౌన్ నిబంధనలు దాదాపు పూర్తిగా సడలించారు. దీంతో పెద్దఎత్తున జనం ఎగబడుతున్నారు.

అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా కారణంగా ఇప్పటికే వేలాదిమంది మరణించటం తెలిసిందే. అగ్రరాజ్యానికి పీడకలలా చెప్పుకునే వియత్నాం యుద్ధ సమయంలో కోల్పోయిన మరణాలకు మించిన రీతిలో కరోనా మరణాలు ఉంటాయన్న అంచనాలు వ్యక్తం కావటం తెలిసిందే. దాదాపు లక్ష మంది అమెరికన్లు కరోనా కారణంగా మరణిస్తారన్న అంచనాల్ని ఆ దేశాధ్యక్షుడు ట్రంపే స్వయంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, కొన్ని అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
అమెరికాలో మళ్లీ సందడి మొదలైంది. దాదాపు 31 రాష్ట్రాల్లో తిరిగి కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాక్‌డౌన్ నిబంధనలు దాదాపు పూర్తిగా సడలించారు. ఫ్లోరిడా, క్యాలిఫోర్నియా, న్యూయార్క్‌లలో రోడ్లన్నీ బిజీబిజీగా కనిపిస్తున్నాయి. కిక్కిరిసిన జన సమూహాలు బీచ్‌లు, రెస్టారెంట్లు, పార్క్‌లు కోలాహాలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్షా 20 వేల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడి, 68 వేల మందికి పైగా మృతి చెందినప్పటికీ, అమెరికా పౌరులు స్వేచ్ఛగా తిరిగేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజల మూడ్‌ను గమనించిన ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాక్‌డౌన్ నిబంధనలను సడలించారు.