AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Doohan: కాంగ్రెస్‌ మహిళా నేతతో ఆకతాయి అసభ్య ప్రవర్తన.. సీనియర్‌ నేతలున్న స్టేజ్‌పై వెర్రి చేష్టలు

హర్యానాలోని నార్నోడ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. జాస్సీ ర్యాలీలో ఓ వ్యక్తి వేదికపై మహిళా నేత సోనియా దుహాన్‌ను బహిరంగంగా వేదింపులకు దిగాడు. పక్కనే నిలబడి ఉన్న మరో నాయకుడిని చూసి, ఆ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం సోనియా దుహాన్‌పై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు...

Sonia Doohan: కాంగ్రెస్‌ మహిళా నేతతో ఆకతాయి అసభ్య ప్రవర్తన.. సీనియర్‌ నేతలున్న స్టేజ్‌పై వెర్రి చేష్టలు
Sonia Doohan
Srilakshmi C
|

Updated on: Oct 07, 2024 | 1:58 PM

Share

హర్యాణా, అక్టోబర్‌ 7: హర్యానాలోని నార్నోడ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. జాస్సీ ర్యాలీలో ఓ వ్యక్తి వేదికపై మహిళా నేత సోనియా దుహాన్‌ను బహిరంగంగా వేదింపులకు దిగాడు. పక్కనే నిలబడి ఉన్న మరో నాయకుడిని చూసి, ఆ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం సోనియా దుహాన్‌పై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. గుంపులో ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురి చేశాడు. సీనియర్ నాయకులు ఎందరో ఉన్న స్టేజ్‌పై మహిళా నేత సోనియా దుహాన్‌ను సదరు ఆకతాయి వేదింపులకు గురిచేయడం విభ్రాంతికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నెటిజన్లు ఈ ఘటనను ఖండిస్తూ, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రెండ్రోజుల క్రితం ధాన్యం మార్కెట్‌లో జరిగిన ర్యాలీలో రోహ్‌తక్ ఎంపీ దీపేందర్ హుడా సమక్షంలో కాంగ్రెస్ మహిళా నేత సోనియా దూహన్‌ను తాకేందుకు ఓ వ్యక్తి పదే పదే ప్రయత్నాలు చేశాడు. సోనియా దూహన్‌ వెనుక నిలబడిన ఓ వ్యక్తి ఆమె ఛాతీని పదే పదే తాకేందుకు ప్రయత్నించినట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపించింది. అయితే వేదికపై ఉన్న మరో మహిళా నాయకురాలు అతడి చేతిని పట్టుకుని పక్కకు లాగింది. ఈ ఘటన జరిగినప్పుడు దీపేందర్ హుడా, సోనిపట్ కాంగ్రెస్ ఎంపీ సత్పాల్ బ్రహ్మచారి, జస్సీ పెట్వార్, ఇతర నేతలు కూడా ఉన్నారు. ఈ విషయంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హర్యాణా కాంగ్రెస్‌ మహిళా నేత సోనియా దూహన్‌ గతంలో శరద్ పవార్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. వేదికపై సోనియా దుహాన్‌తో అసభ్యంగా ప్రవర్తించడంపై కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ.. ‘నేను ఆమెతో మాట్లాడాను, అక్కడ తనను వేధింపులకు గురిచేశారని ఆమె నాతో చెప్పింది. ఈ రోజు ఏ మహిళకైనా ఇలా జరిగితే, మీరు ఊరుకుంటారా. ఇంతకంటే అధ్వాన్నంగా, ఖండించదగినదిగా వేరొకటి ఉంటుందా? దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి…’ అని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఎవరీ సోనియా దుహాన్..

సోనియా దుహాన్ 1992లో హర్యానాలోని హిసార్‌లో జన్మించారు. కేవలం 21 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. హిసార్ ప్రాంతంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత సోనియా దుహాన్ అంబాలాకు వెళ్లారు. అంబాలాలో చదివిన తరువాత, కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కురుక్షేత్ర నుంచి సోనియా పైలట్ శిక్షణ తీసుకోవడానికి పూణె వెళ్లారు. ఇక్కడ ఆమె 21 సంవత్సరాల వయస్సులో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె శరద్ పవార్‌ను కలుసి, ఆయన ప్రభావంతో ఎన్‌సిపిలో చేరారు. ఆమె NCP విద్యార్థి విభాగంలో భాగమైంది. తన తండ్రి అనారోగ్యంతో మరణించడంతో, సోనియా దుహాన్ పూణేలో శిక్షణను విడిచిపెట్టి తిరిగి రావాల్సి వచ్చింది. పూణె నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి యూత్ ఎన్సీపీకి చేరి రాజకీయాల్లో చురుకుగా ఉండటం ప్రారంభించారు. ఢిల్లీలోని ఎన్సీపీ ప్రధాన కార్యాలయ బాధ్యతలను శరద్ పవార్ సోనియాకు అప్పగించారు. ఢిల్లీ యూనివర్శిటీలో జరిగిన రెండు ఎన్నికల్లో ఎన్‌సిపి విద్యార్థి విభాగాన్ని విజయవంతంగా నడిపించిన విధానం మరువలేనిది. అనంతరం ఆమె తొలిసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, రెండోసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎన్సీపీ విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షురాలిగా పదోన్నతి పొందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్లుగా క్రియాశీలకంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం సోనియా దుహాన్ ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.