మూడున్నర టన్నులు..2022లో భారత్ లో పట్టుబడిన స్మగ్లింగ్ బంగారం లెక్క ఇదీ..

విదేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని అక్రమంగా తీసుకురావడం, నిందితులను పోలీసులు అరెస్టు చేయడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే అధికారులు ఇప్పటివరకు ఎంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మూడున్నర టన్నులు..2022లో భారత్ లో పట్టుబడిన స్మగ్లింగ్ బంగారం లెక్క ఇదీ..
Gold
Follow us

|

Updated on: Mar 22, 2023 | 8:21 AM

విదేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని అక్రమంగా తీసుకురావడం, నిందితులను పోలీసులు అరెస్టు చేయడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే అధికారులు ఇప్పటివరకు ఎంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఎంత బంగారం దొరికిందన్న విషయలాను కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. 2022లో దాదాపు 3,502 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.2021తో పోలిస్తే దాదాపు 47 శాతం పెరిగిందని పేర్కొంది . 2021లో మొత్తం 2,383 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా.. 2020లో 2,154 కిలోల బంగారం పట్టుబడిందని తెలిపింది. అయితే అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2021లో 2,445 బంగారం స్వాధీనం చేసుకున్న కేసులు రాగా.. 2022లో ఆ కేసుల సంఖ్య 3,982 కి ఎగబాకిందని తెలిపింది. ఒక్క కేరళలోనే 2022లో దాదాపు 755 కిలోల బంగారం పట్టుబడగా.. 2021లో 586 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 2022లో కేరళ తర్వాత మహారాష్ట్రలో 535 కిలోలు, తమిళనాడులో 519 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అలాగే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చంఢీగర్, జమ్ము కశ్మీర్, లే లజఖ్ రాష్ట్రాల నుంచి 556 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. చైనా తర్వాత బంగారాన్ని ఎక్కవగా వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇండియాలో బంగారాన్ని డిమాండ్ ఎక్కువగా ఉండటంతోనే ఇలాంటి స్మగ్లింగ్ కేసులు పెరుగుతున్నట్లు అధిరారులు చెబుతున్నారు.