AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shashi Tharoor: ఏఐసీసీ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్.. పోటీ నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ..

Congress President: పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరపాలని ఇటీవల పత్రికాముఖంగా వ్యాఖ్యానించారు. అదేవిధంగా సీడబ్ల్యుసీ లోని 12 స్థానాలకు ఎన్నికలు జరపాలని అభిషలిస్తున్నట్లు..

Shashi Tharoor: ఏఐసీసీ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్.. పోటీ నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ..
Shashi Tharoor
Sanjay Kasula
|

Updated on: Aug 30, 2022 | 10:32 AM

Share

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో గాంధీలు దూరంగా ఉంటామన్న నేపథ్యంలో పోటీ అనివార్యం కానుంది. కేరళలోని తిరువనంతపురం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాను బరిలో నిలిచే విషయం ఇంకా స్పష్టం చేయలేదు. కానీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరపాలని ఇటీవల పత్రికాముఖంగా వ్యాఖ్యానించారు. అదేవిధంగా సీడబ్ల్యుసీ లోని 12 స్థానాలకు ఎన్నికలు జరపాలని అభిషలిస్తున్నట్లు అభిప్రాయ పడ్డారు థరూర్. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక అక్టోబర్ 17న జరుగునున్నదని ప్రకటించింది కాంగ్రెస్. 2020లో పార్టీలో సంస్కరణలకు డిమాండ్ చేసిన జీ23 నేతల్లో శశి థరూర్ ఒకరు. అలా కాకుండా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి ఎవరైనా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా మారితే.. జీ23 గ్రూపు ప్రతినిధిగా శశి థరూర్ అతనిపై పోటీ చేయవచ్చు. హైకమాండ్ ప్రతినిధి గెలుపొందడం ఖాయమైనా.. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై పార్టీలోనే చర్చించేందుకు పోటీ తప్పదని వర్గం భావిస్తోంది. థరూర్ అంగీకరించకపోతే మనీష్ తివారీ పోటీ చేయాలని నిర్ణయించారు. రాహుల్ గాంధీ పోటీ చేసినా తివారీ రంగంలోకి దిగవచ్చు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనప్పటికీ గ్రూపు సభ్యుల్లో మాత్రం చర్చ జోరుగా సాగుతోంది.

ఇది G23 గ్రూప్‌ను పార్టీ లోపల నుంచి నడిపించడానికి ప్రకటించిన స్థితిలో భాగం. పార్టీ నాయకత్వం పని విధానాలను మార్చాలని డిమాండ్ చేస్తూ 2020 ఆగస్టులో G23 రివిజనిస్ట్ గ్రూపుగా ఏర్పడింది. దీనికి నాయకత్వం వహించిన గులాంనబీ ఆజాద్ పార్టీని వీడడం సరికాదన్న భావన గ్రూపు సభ్యుల్లో ఉంది. 

హైకమాండ్ అభ్యర్థిని అధ్యక్షుడిగా ఎన్నుకునే సాధారణ పద్ధతి ఈసారి పార్టీలో ఉండకూడదనేది ఆ వర్గంలోని మెజారిటీ అభిప్రాయం. ఎన్నికలను తప్పించుకుంటే పార్టీని ప్రభావితం చేసే అంశాలు ఏ స్థాయిలోనూ చర్చకు రావు. పోటీని నిర్వహించడం ద్వారా ఈ సమస్యలను నాయకత్వానికి అందించవచ్చు. వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఏంటని హైకమాండ్ అభ్యర్థిని అడగవచ్చు. హైకమాండ్‌కు ప్రతినిధి అనే ఒకే ఒక్క కారణంతో పైసా ఇవ్వకుండా అధికార పీఠాన్ని అధిష్టించే వ్యక్తికి అధ్యక్ష పదవి బాధ్యతలు తప్పవని కూడా ఆ వర్గం అభిప్రాయపడింది. 

కొత్త అధ్యక్షుడిని కనుగొనే ఎన్నిక అక్టోబర్ 17న జరగనుంది. నామినేషన్ పత్రాల ఉపసంహరణకు చివరి తేదీ అయిన అక్టోబర్ 8న ఒకే ఒక్క అభ్యర్థి ఉంటే విజేతను ప్రకటిస్తారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు జీ23 క్యాంపులో ప్రణాళికలు రచిస్తున్నారు. 

శశిథరూర్ ఎవరంటే..?

రైటర్‌గా, ఫిలాసపర్, మేధావిగా థరూర్‌కి పేరుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో గాంధీలు దూరంగా ఉంటామన్న నేపథ్యంలో పోటీ అనివార్యం అయ్యింది. కేరళలోని తిరువనంతపురం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశిథరూర్.. పోటీపై ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇంకా దీనిపై అధికార ప్రకటన రాలేదు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరపాలని గట్టిగా డిమాండ్‌ చేసిన థరూర్… సీడబ్ల్యుసీలో 12 స్థానాలకు సైతం ఎన్నికలు జరపాలన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న జరిగే ఎన్నికలపై ఇప్పటి నుంచే హీట్‌ పెరిగింది. 2020లో కాంగ్రెస్‌ పార్టీలో సంస్కరణలకు డిమాండ్ చేసిన జీ-23 నేతల్లో శశి థరూర్ కూడా ఉన్నారు.

1956 మార్చి 9న ఇంగ్లండ్ రాజధాని లండన్ లో జన్మించిన శశి థరూర్. ఆయన తండ్రి చంద్రన్ థరూర్ తల్లి సులేఖ మీనన్.. వీరు కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన వారు. చంద్రన్ థరూర్ వృత్తి రీత్యా లండన్ లో పనిచేస్తున్న సమయంలో జన్మించిన శశి థరూర్. తన రెండేళ్ల వయసులో శశి థరూర్ పేరెంట్స్ ఇండియాకు తిరిగి వచ్చారు. భారత్ లోనే పెరిగి పెద్దవాడైన శశి థరూర్. కేరళలోని యెర్ కాడ్, బాంబే, కోల్ కతాలో పాఠశాల విద్యను అభ్యసించిన థరూర్.. ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి బీఏ చదివారు. అమెరికాలో టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఎంఏ( లా అండ్ డిప్లమెసి) ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పీహెచ్ డీ పూర్తిచేశారు థరూర్.

తన కెరియర్ ను ఐక్య రాజ్య సమితి లో ప్రారంభించారు. జెనీవాలో యూఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యూఎన్ హెచ్ సీఆర్) లో ఉద్యోగిగా తన కెరియర్ ను మొదలు పెట్టారు. అనంతరం సింగపూర్ లోని యూఎన్ హెచ్ సీఆర్ కార్యాలయ అధిపతిగా పనిచేశారు. అనంతరం ఐక్యరాజ్య సమితిలో పలు పదవులను అలంకరించిన థరూర్.. 2006లో యూఎన్ సెక్రెటరీ జనరల్ పోస్ట్ కు బరిలో నిలిచి రెండో స్థానంలో నిలిచారు థరూర్.

మరిన్ని జాతీయ వార్తల కోసం