Serial Killer: వృద్ధ మహిళలే అతని టార్గెట్.. హడలెత్తిస్తున్న సైకో కిల్లర్.. బిక్కుబిక్కుమంటున్న జనం..
వృద్ధ మహిళలే అతని టార్గెట్.. వస్తాడు అఘాయిత్యానికి పాల్పడి చంపుతాడు.. ఆ తర్వాత పరారవుతాడు.. యూపీలో సైకో కిల్లర్ హడలెత్తిస్తున్నాడు. ఇప్పటివరకు ముగ్గురు వృద్ధ మహిళలను దారుణంగా చంపాడు.

వృద్ధ మహిళలే అతని టార్గెట్.. వస్తాడు అఘాయిత్యానికి పాల్పడి చంపుతాడు.. ఆ తర్వాత పరారవుతాడు.. యూపీలో సైకో కిల్లర్ హడలెత్తిస్తున్నాడు. ఇప్పటివరకు ముగ్గురు వృద్ధ మహిళలను దారుణంగా చంపాడు. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని సీరియల్ కిల్లర్ సంచరిస్తుండటంతో.. పోలీసులు అప్రమత్తయ్యారు. బారాబంకిలో సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు పోలీసులు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సైకో కిల్లర్ వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని చంపుతున్నట్లు బారాబంకి పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల వ్యవధిలోనే సైకో కిల్లర్ ముగ్గురు మహిళలను హత్య చేశాడని.. అతన్ని పట్టుకునేందుకు సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఈ మేరకు పోలీసులు అనుమానితుడి ఫోటోను చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతను ఎక్కడైనా తారసపడినా.. అతని గురించి సమాచారం తెలిసినా వెంటనే తమకు చెప్పాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారిని తొలగించి ఆయన స్థానంలో మరో అధికారిని ఎస్పీ నియమించారు.
కాగా.. సైకో కిల్లర్ వృద్ధ మహిళను చంపిన మొదటి సంఘటన 5 డిసెంబర్ 2022న అయోధ్య జిల్లాలో నమోదైంది. మావాయి ప్రాంతంలోని ఖుషేతి గ్రామానికి చెందిన 60 ఏళ్ల బాధితురాలు పని నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిపోయింది. మళ్లీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.




అనంతరం డిసెంబర్ 6న మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై దుస్తులు కూడా లేవని, మహిళ ముఖం, తలపై గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో మహిళపై అత్యాచారం చేసి, గొంతుకోసి హత్య చేసినట్లు తేలిందని వెల్లడించారు. అలాంటి ఘటనలే మరో రెండు జరగడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
