AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Crusader Dr Shanta Dead: వైద్య వృత్తిని వ్యాపార కళ నుంచి వేరుచేసి. రోగులకు సేవలను అందించిన డాక్టర్ శాంతి ఇక లేరు

ప్రఖ్యాత వైద్య రంగ పరిశోధకురాలు, క్యాన్సర్ స్పెషలిస్ట్ డా. వి. శాంత  మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆసుపత్రి అభివృద్ధికీ, రోగుల సేవలకు అంకితమై అవివాహితగా మిగిలిపోయారు. ప్రఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీతలైన "సి.వి.రామన్"..

Cancer Crusader Dr Shanta Dead: వైద్య వృత్తిని వ్యాపార కళ నుంచి వేరుచేసి. రోగులకు సేవలను అందించిన డాక్టర్ శాంతి ఇక లేరు
Surya Kala
|

Updated on: Jan 19, 2021 | 12:03 PM

Share

Cancer Crusader Dr Shanta Dead: ప్రఖ్యాత వైద్య రంగ పరిశోధకురాలు, క్యాన్సర్ స్పెషలిస్ట్ డా. వి. శాంత  మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 93 ఏళ్ళు.   డా. శాంత మృతికి ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.  క్యాన్సర్ నిర్ధారించడానికి, క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం డాక్టర్ వి శాంత చేసిన కృషి ఎప్పుడు గుర్తుండి పోతుందని అన్నారు. చెన్నైలోని అడయార్‌లోని క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ద్వారా పేదలకు ఆమె అందించిన సేవలు మరపురానివి అన్నారు.  తాను 2018 లో ఆ ఇనిస్టిట్యూట్ సందర్శించిన విషయాని గుర్తు చేసుకుంటూ మీ మరణం నన్ను బాధిస్తుంది శాంత..  ఓం శాంతి అని ట్విట్ చేశారు.

డా. వి. శాంత మార్చి 11వ తేదీ 1927 న చెన్నైలో గల మైలాపూర్ లో జన్మించారు.  ఆమె కుటుంబ నేపధ్యం కూడా గొప్పది. ప్రఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీతలైన “సి.వి.రామన్”, “సుబ్రహ్మణ్య చంద్రశేఖర్” వంటివారు శాంత బంధువులు.  డాక్టర్ కావాలనే కలను నిజం చేసుకుంటూ.. ఆమె మద్రాసు యూనివర్శిటీ నుండి 1949 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.  1955 లో ఎం.డిని పూర్తి చేసి పరిశోధనలు చేశారు. తన 13 వ యేట నుంచే వైద్య వృత్తి చేపట్టి రోగులకు సేవలు చేయాలని కలలు కనేవారు. 1955 లో కాన్సర్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించిన నాటి నుండి క్యాన్సర్ రోగులకు తన సేవలను అందిస్తున్నారు. ఆమె వైద్యాన్ని ఓ వృత్తిగా ఏనాడూ భావించలేదు. మనిషిలోని బాధల్ని మానవీయ కోణంలో దర్శించి, మానవతా దృక్పథంతో స్పందించి వైద్య వృత్తిని వ్యాపార కళ నుంచి వేరుచేశారు. ఆరు దశాబ్దాలకు పైగా కీలకమైన శస్త్రచికిత్సలను పర్యవేక్షిస్తూ కేన్సర్ చికిత్సా పరిశోధనా రంగంలో సరికొత్త మార్పులను ఆవిష్కరించారు.  తన జీవిత సర్వస్వాన్ని వ్యాధి పీడితుల కోసం ధారపోసిన మహామనిషిగా డాక్టర్ శాంత గారు నీరాజనాలు అందుకున్నారు.

డాక్టర్ శాంత గారికి 2005 లో ప్రతిష్ఠాత్మకమైన “రామన్ మెగసెసె అవార్డు” లభించింది. తద్వారా అంతర్జాతీయ ఖ్యాతినార్జించారు. తమిళనాడు లోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ పై అవగాహన సదస్సులు నిర్వహించి ఈమె పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈమె ఆసుపత్రి అభివృద్ధికీ, రోగుల సేవలకు అంకితమై అవివాహితగా మిగిలిపోయారు. ఈమెకు వైద్యరంగంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ”తో పాటు మొత్తం 32 అవార్డులు వరించాయి. వైద్య రంగానికి వీరు చేసిన కృషికిగాను కేంద్ర ప్రభుత్వం వీరిని పద్మ విభూషణ్ పురస్కారంతొ సత్కరించింది.  అయితే  తనకు ఎన్ని అవార్డులు వచ్చినా  “స్వస్థత పొందిన రోగి మొహం లోని చిరునవ్వును మించిన అవార్డు ఉండదు అంటారు శాంత. క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ విశేషమైన అనుభవం గల డాక్టర్ శాంత శాశ్వతంగా సెలవుదీసుకున్నారు.

Also Read: అత్యవసర పరిస్థితిల్లో వినియోగానికి చైనా వ్యాక్సిన్ కు అనుమతిలిచ్చిన పాకిస్థాన్