AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ సీనియర్, కర్ణాటక మాజీ గవర్నర్‌ మృతి..

కేంద్ర మాజీ మంత్రి, కర్నాటక మాజీ గవర్నర్ హన్సరాజ్ భరద్వాజ్ కన్నుమూశారు.. గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన బుధవారం ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే..

కాంగ్రెస్ సీనియర్, కర్ణాటక మాజీ గవర్నర్‌ మృతి..
Jyothi Gadda
|

Updated on: Mar 09, 2020 | 7:37 AM

Share

కేంద్ర మాజీ మంత్రి, కర్నాటక మాజీ గవర్నర్ హన్సరాజ్ భరద్వాజ్ కన్నుమూశారు.. గత కొద్దికాలంగా మూత్రపిండాల వ్యాధితో భాదపడుతున్న ఆయన బుధవారం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆదివారం గుండెపోటు రావటంతో తుదిశ్వాస విడిచారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం నిఘమ్​బోధ్​ ఘాట్​లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి సహా కేరళ, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్​గా విధులు నిర్వర్తించారు హన్సరాజ్​.  2009 నుంచి 2014 వరకు ఆయన కర్ణాటక గవర్నర్‌గా సేవలందించారు. జనవరి 2012 నుంచి మార్చి 2013 వరకు కేరళ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఆయన రాజకీయ ప్రస్థానం 1982లో ప్రారంభమైంది. ఇందిరాగాంధీ ప్రోద్భలంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌ నుంచి 5 సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. రాజీవ్‌గాంధీ, పీ.వి.నరసింహారావు హయాంలో 9 ఏళ్ల పాటు లా మినిస్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2009లో యూపీఏ అధికారంలోకి వచ్చాక, వీరప్ప మొయిలీకి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన యూపీఏ అధిష్టానం.. హన్స్‌రాజ్‌ భరద్వాజ్‌ను కర్ణాటక గవర్నర్‌గా నియమించింది.

హన్సరాజ్​ భరద్వాజ్​ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్​ చేసింది.

జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత