AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యా కరోనా…భారత్‌లోనూ డేంజర్ బెల్స్‌…ఒకే ఇంట్లో ఐదుగురికి..!

భారత్‌ లో కరోనా డేంజర్ బెల్స్‌ మోగిస్తోంది..మొత్తం 89 దేశాలకు పాకిన ఈ మహమ్మారి భారత్‌లోనూ పంజా విసురుతోంది. భారత్​లో కరోనా బాధితుల సంఖ్య..

క్యా కరోనా...భారత్‌లోనూ డేంజర్ బెల్స్‌...ఒకే ఇంట్లో ఐదుగురికి..!
Jyothi Gadda
|

Updated on: Mar 09, 2020 | 9:19 AM

Share

భారత్‌ లో కరోనా డేంజర్ బెల్స్‌ మోగిస్తోంది..మొత్తం 89 దేశాలకు పాకిన ఈ మహమ్మారి భారత్‌లోనూ పంజా విసురుతోంది. భారత్​లో కరోనా బాధితుల సంఖ్య 43 కి చేరింది. కేరళలో ఐదుగురు, తమిళనాడులో ఒకరికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.  ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న ఈ మహమ్మారి బారిన పడి చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమౌతోంది.

కేరళ పతనంతిట్ట జిల్లాకు చెందిన ఐదుగురికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి కేకే శైలజ చెప్పారు. వీరిలో ముగ్గురు ఇటలీ నుంచి ఇటీవలే వచ్చారని, వారి వల్లే మరో ఇద్దరికి వైరస్​ సోకిందని తెలిపారు. ఐదుగురికీ ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు శైలజ. కాగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. భారత్​లో తొలి కరోనా కేసు నమోదైంది కేరళలోనే. చైనా వుహాన్​ నుంచి వచ్చిన ఓ విద్యార్థికి వైరస్​ సోకినట్లు మొదటగా ఇక్కడే గుర్తించారు. తమిళనాడులోనూ తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా సోకిన వ్యక్తికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఆ రాష్ట ఆరోగ్యశాఖ కార్యదర్శి బీల రాజేశ్ వెల్లడించారు.

కరోనా లక్షణాలతో శనివారం బంగాల్​లోని ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి మరణించాడు. అయితే సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఆ వ్యక్తి.. కరోనా లక్షణాలతో శనివారమే ఆసుపత్రిలో చేరాడు. కానీ ఆ వ్యక్తికి మధుమేహం ఉన్నట్టు గుర్తించిన వైద్యులు.. అందువల్లే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాజస్థాన్​లో కరోనా వైరస్​ సోకిన ఇటలీ దంపతుల పరిస్థితి మెరుగుపడుతోంది. మరోవైపు గుజరాత్​లో కరోనాపై అనుమానాలతో సేకరించిన 47 రక్తనమూనాలు నెగిటివ్​గా తేలాయి. విదేశాల నుంచి వచ్చిన మొత్తం 2,107 మందిపై పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,154 మంది నిర్బంధ కాలం ఇప్పటికే ముగిసింది.

కరోనా వైరస్..​ భారత ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది. మహమ్మారి సోకిన వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుండటంతో…వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్​ కట్టడికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించింది. కరోనా కలవరాన్ని కట్టడి చేసేందుకు పాలకులు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. ఇప్పటికే వైరస్‌ వ్యాప్తిని నిరోధించే యత్నం చేస్తూనే ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. అంతేకాదు.. అత్యవసర సమయాల్లో సేవలు అందించేందుకు ప్రత్యేక అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేసి కరోనా అనుమాతులను తరలించేందుకు ముందుకు కదులుతున్నారు.