రికార్డ్స్ బద్దలు కొడుతోన్న పవన్.. మగువా.. మగువా సాంగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ట్రెండ్‌ని ఫాలో కారు.. సెట్ చేస్తారన్నమాట. అలాగే ఇప్పుడు మరో ట్రెండ్ క్రియేట్ చేశారు. తాజాగా.. 'ఉమెన్స్ డే' సందర్భంగా పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'పింక్' రీమేక్ వకీల్ సాబ్ నుంచి 'మగువా.. మగువా..' సాంగ్ రిలీజై ట్రెండ్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ట్రెండ్‌ని ఫాలో కారు.. సెట్ చేస్తారన్నమాట. అలాగే ఇప్పుడు మరో ట్రెండ్ క్రియేట్ చేశారు. తాజాగా.. ‘ఉమెన్స్ డే’ సందర్భంగా పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘పింక్’ రీమేక్ వకీల్ సాబ్ నుంచి ‘మగువా.. మగువా..’ సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ అయిన కాసేపటికే రికార్డులు సృష్టించింది. కొద్ది నిమిషాల్లోనే.. 1.5 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్‌ని రాబట్టింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. పవర్ స్టార్ పవన్ అంటే ఏంటో. అభిమానులకు ఆయనో దేవుడు.
కాగా.. ముఖ్యంగా ఈ పాటలోని లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. దానికి తోడు ఈజీగా అర్థమయ్య రీతిలో ఉండటంతో.. అందరూ ఈ సాంగ్‌కి ఫిదా అవుతున్నారు. దీన్ని సిధ్ శ్రీరామ్ పాడగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. థమన్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పవన్ ఫస్ట్ లుక్ విడుదలవ్వగా.. ట్విట్టర్‌లో #PSPK26FirstLook పేరుతో తెగ ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు #Vakeelsaab మగువా మగువా ట్రెండ్ అవుతోంది. దీంతో.. ఈ సినిమా ఏమాత్రం జనరంజకంగా ఉన్నా.. ఫుల్లు రికార్డ్స్ బ్రేక్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం పింక్ రిమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో పవన్ కల్యాణ్ న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, బోనీ కపూర్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మే 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
A Heart Touching Melody #MaguvaMaguva? lyrical from Powerstar @PawanKalyan’s #VakeelSaab Hits 1.5M+ Real-time Views ??
► https://t.co/qiC7scT8fI@SVC_official #SriramVenu @i_nivethathomas @yoursanjali@AnanyaNagalla @MusicThaman @ramjowrites @sidsriram @adityamusic
— Aditya Music (@adityamusic) March 8, 2020
ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!
Read More this also: ఆయన్ని కొడితే రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆనందంలో రోజా!
Read More: మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33
ఇది కూడా చదవండి: జగన్, చంద్రబాబులపై మంచు విష్ణు హాట్ కామెంట్స్..