శశికళ బెంగళూరు టు చెన్నై జర్నీ కాస్ట్ ఎంతో తెలుసా.? 23 గంటల ప్రయాణానికి 2 వందల కోట్లట.!

ఒకటి కాదు..రెండు కాదు, అక్షరాలా 2 వందల కోట్లు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ 23 గంటల ప్రయాణానికి..

శశికళ బెంగళూరు టు చెన్నై జర్నీ కాస్ట్ ఎంతో తెలుసా.? 23 గంటల ప్రయాణానికి 2 వందల కోట్లట.!
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 12, 2021 | 3:07 PM

ఒకటి కాదు..రెండు కాదు, అక్షరాలా 2 వందల కోట్లు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ 23 గంటల ప్రయాణానికి అయిన ఖర్చు. అంటే, గంటకు 8కోట్ల 60లక్షలకు పైగా ఖర్చన్నమాట. ఏమిటిదంతా అనుకుంటున్నారా..? చిన్నమ్మ శశికళ.. బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చిన సందర్భంగా ఆమెకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పడానికి శశికళ అనుచరులు పెట్టిన ఖర్చు. కేవలం తమిళనాట మాత్రమేకాదు, యావత్ దేశవ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.

అక్రమాస్తుల కేసులో అరెస్టై బెంగళూరు పరప్పన జైల్లో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన శశికళ, తమిళనాడు గడ్డపై గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. వచ్చిందే తడవుగా తమిళనాడు రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టిస్తున్నారు కూడా. వచ్చీ రాగానే షాకుల మీద షాకులిస్తూ అన్నాడీఎంకే శ్రేణులకు చుక్కలు చూపిస్తున్నారు. ఐతే ఇదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడామె బెంగళూరు టు చెన్నై టూర్‌ మరో ఎత్తు. నాలుగేళ్ల తర్వాత రాష్ట్రానికొచ్చిన చిన్నమ్మకు ఘన స్వాగతం పలికారు ఆమె అనుచరులు. ఆ గ్రాండ్‌ అరేంజ్‌మెంట్స్‌కైన ఖర్చే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బెంగళూరు నుంచి చెన్నై వరకూ ఔరా అనిపించేలా స్వాగత ఏర్పాట్లు చేశారు శశికళ అనుచరులు. దాదాపు వంద కార్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్ణ కుంభ స్వాగతాలు, అడుగడుగునా పూలను వెదజల్లుతూ చిన్నమ్మను తమిళనాడుకు తీసుకెళ్లారు. ఐతే హెలికాఫ్టర్‌ నుంచి పూల వర్షం కురిపించాలని భావించినప్పటికీ కుదరలేదు. ఆ ఒక్కటి మినహా చిన్నమ్మకు బెంగళూరు నుంచి చెన్నై వరకూ ఐదు గంటలు సాగాల్సిన ప్రయాణం 23 గంటలు పట్టిందంటే ఏ రేంజ్‌లో స్వాగతం పలికారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దారి పొడవునా ఏఎంఎంకే కార్యకర్తలు, అభిమానులు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. దీంతో శశికళ తమిళనాడు చేరుకునేందుకు బాగా ఆలస్యమైంది. 23 గంటల పాటు సాగిన శశికళ స్వాగతానికి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చైనట్లు తెలుస్తోంది. అంటే, గంటకు 8కోట్ల 60లక్షలకుపైమాటే. అంటే.. శశికళ తన బలాన్ని చాటి చెప్పుకునేందుకే ఇంత ఖర్చు చేసి హడావిడి చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read also: ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఇక సాకారం, అతి త్వరలోనే సాగు, తాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు ఆవిష్కృతం

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!