AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kranti Redkar: మా మధ్యాహ్న భోజనం ఇదేనండి.. మహారాష్ట్ర మంత్రికి చురకలంటించిన సమీర్ సతీమణి..

షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టై నప్పటి నుంచి ఎన్‌సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాఖడే, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ మధ్య వాగ్యద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే..

Kranti Redkar: మా మధ్యాహ్న భోజనం ఇదేనండి.. మహారాష్ట్ర మంత్రికి చురకలంటించిన సమీర్ సతీమణి..
Basha Shek
|

Updated on: Nov 03, 2021 | 8:37 AM

Share

షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టై నప్పటి నుంచి ఎన్‌సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాఖడే, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ మధ్య వాగ్యద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. సమీర్‌ పలువురిపై తప్పుడు కేసులు బనాయించాడని, లంచాలు తీసుకుని కోట్లకు పడగలెత్తాడని మాలిక్‌ ఆరోపించారు. అదేవిధంగా వాంఖడే రూ. 70 వేల విలువచేసే చొక్కాలు, లక్షలు విలువ చేసే ప్యాంట్లు, చేతి గడియారాలు ధరిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. అయితే మంత్రి ఆరోపణలన్నీ నిరాధారమైనవని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సమీర్ మాలిక్‌కు సూచించారు. తనపై బురద జల్లేందుకే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో సమీర్‌పై మంత్రి చేస్తోన్న విమర్శలకు ఆయన సతీమణి క్రాంతి రేడ్కర్‌ దీటుగా బదులిచ్చారు.

అందుకే ఇలా వెల్లడిస్తున్నాం..! ఈ సందర్భంగా తమ మధ్యాహ్న భోజనం వివరాలను ట్విట్టర్‌లో పంచుకున్న క్రాంతి ‘ మేం ఈ రోజు మధ్యాహ్న భోజనంలో దాల్‌ మఖ్నీ, జీరా రైస్‌ తీసుకున్నాం. జీరా రైస్‌ ఇంట్లోనే తయారుచేసుకోగా, దాల్‌ మఖ్నీని బయటి నుంచి ఆర్డర్‌ చేసి తెప్పించుకున్నాం. ఇది కూడా కేవలం రూ. 190 మాత్రమే. భవిష్యత్‌లో మళ్లీ ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారికి సాధ్యం కాని రీతిలో మేం ఆహారానికి ఖర్చు చేస్తున్నాం అనొచ్చు. అందుకే ఆధారాలతో సహా మా మధ్యాహ్న భోజనం వివరాలు వెల్లడిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:

Petrol, Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..!

Edible Oil: దీపావళికి ముందు గుడ్‎న్యూస్.. తగ్గిన వంట నూనె ధరలు.. ఎంత తగ్గాయంటే..

Modi in COP26: ఒకే సూర్యుడు..ఒకే ప్రపంచం..ఒకే గ్రిడ్ ఇదే మన నినాదం కావాలి.. సౌరశక్తిపై ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపు!