18,800 అడుగుల ఎత్తులో సరిహద్దు పోలీసుల యోగాసనాలు.. ఫొటోలు వైరల్‌

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండో టిబెటియన్‌ సరిహద్దుల్లోని పోలీసులు 18వేల అడుగుల ఎత్తులో యోగా చేశారు

18,800 అడుగుల ఎత్తులో సరిహద్దు పోలీసుల యోగాసనాలు.. ఫొటోలు వైరల్‌
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2020 | 8:15 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండో టిబెటియన్‌ సరిహద్దుల్లోని పోలీసులు 18వేల అడుగుల ఎత్తులో యోగా చేశారు. ఇండో-చైనా సరిహద్దులో ఉన్న సైనికులతో కలిసి 18,800 అడుగుల ఎత్తులో సబ్ జీరో ఉష్ణోగ్రతల వద్ద వారు యోగాసనాలు వేశారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లదాక్‌లోని ఖర్‌డంగ్‌ లా ప్రాంతంలో ప్రాణాయామ, సూర్య నమస్కార్ వంటి యోగాసనాలను వారు చేశారు. ఇక దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బిగ్ సెల్యూట్.. మా దేశానికి మీరు గర్వకారణం.. మా ఆర్మీ బలం ఇదే.. జై హింద్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో యోగా'(Yoga at Home Yoga With Family) అన్న థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరిగిన విషయం తెలిసిందే.

Read This Story Also: కాంగ్రెస్ ‘టార్చర్‌’ వలనే నాకు ఆరోగ్య సమస్యలు: ఎంపీ సాధ్వీ