Boeing 787: డ్రీమ్‌లైనర్ విమానాల్లో తనిఖీలు ముమ్మరం.. ఇప్పటివరకు ఎన్ని చెక్ చేశారంటే..
ఎయిరిండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో డీజీసీఏతోపాటు మరికొన్ని ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేవరకు విమాన శకలాలు తొలగించవద్దని డీజీసీఏ ఆదేశాలు జారీచేసింది. ఘటనా స్థలం దగ్గర కొనసాగుతున్న క్లీనింగ్ పనులను నిలిపివేశారు. మెడికల్ కాలేజీ భవన సముదాయం సహా ఆ ప్రాంతమంతా పోలీసుల ఆదీనంలో ఉంది. మరోవైపు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల ఫ్లీట్‌కు వన్ టై సేఫ్టీ చెక్ ప్రారంభించింది ఎయిరిండియా.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ దగ్గర జరిగిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభమైంది. డీజీసీఏపాటు NIA ,ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఎయిర్ క్రాఫ్ట్ ఆక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, గుజరాత్ ఫోరెన్సిక్ టీమ్, బోయింగ్ సంస్థ ప్రతినిధులు, బోయింగ్ విమానాల ఇంజన్లు తయారు చేస్తున్న GE సంస్థ ప్రతినిధులు, అహ్మదాబాద్ పోలీసులు రంగంలో ఉన్నారు. విమాన శకలాల నుంచి డీవీఆర్, బ్లాక్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ తర్వాతే ప్రమాదానికి కారణాలు వెల్లడి కానున్నాయి.
మరోవైపు విమాన ప్రమాదంపై హైలెవెల్ కమిటీని ఏర్పాటుచేశామని పౌరవిమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. డీజీసీఏ ఆదేశాల మేరకు ఎయిరిండియా బోయింగ్ 787 విమానాల వన్ టైం సేఫ్టీ చెక్ ప్రక్రియను ప్రారంభించింది. డీజీసీఏ సూచించిన ఇన్‌స్పెక్షన్ జాబితాలో విమానాల్లోని సాంకేతిక వ్యవస్థలు, టేక్ ఆఫ్ ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పటివరకు 9 విమానాల సేఫ్టీ చెకింగ్ పూర్తికాగా, మరో 24 బోయింగ్ 787 విమానాల సెఫ్టీ చెకింగ్ చేయాల్సుంది. డీజీసీఏ ఇచ్చిన కాలపరిమితిలోనే టెస్టింగ్ ప్రక్రియ పూర్తవుతుందని ఎయిరిండియా వెల్లడించింది. ఈ టెస్టింగ్ ప్రక్రియలో కొన్ని పరీక్షలకు ఎక్కువ సమయం పడుతుందని ఎయిరిండియా తెలిపింది.
ఈ ప్రక్రియ కారణంగా చాలా రూట్లలో ఫ్లైట్స్ ఆలస్యంగా నడిచే అవకాశముండటంతో ప్రయాణికులకు ముందస్తుగా తెలియచేస్తున్నారు. కొన్ని సమయాల్లో ఫ్లైట్లు క్యాన్సన్సిల్ అవుతున్నాయి. ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి ఇస్తున్నారు. లేదా ప్రయాణికుల కోరిక మేరకు ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు. ఈ మేరకు ఎయిరిండియా ప్రయాణికులు ముందస్తుగా సమాచారాన్ని అందిస్తోంది. ఎయిర్ పోర్ట్‌కు బయలుదేరే సమయంలో తమ ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవాలని సూచిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..