ఆర్ఎస్ఎస్ ఆర్మీ స్కూల్.. అదేంటో తెలుసా..?

ఆర్ఎస్ఎస్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఈ పేరు తెలియని వారుండరు. ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకున్నా.. ఈ సంస్థ పాత్ర ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఏకంగా ప్రధాని మోదీని కూడా.. ప్రభావితం చేయగల సంస్థ. అయితే ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు అనేక మంది రాజకీయ నాయకులను అందించింది. తాజాగా.. ఇక దేశ రక్షణ వ్యవస్థకు సైనికులను అందించే పనిని భుజాన వేసుకుంది. దీని కోసం ఆర్మీ తరహా స్కూల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ […]

ఆర్ఎస్ఎస్ ఆర్మీ స్కూల్.. అదేంటో తెలుసా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 31, 2019 | 9:01 PM

ఆర్ఎస్ఎస్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఈ పేరు తెలియని వారుండరు. ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకున్నా.. ఈ సంస్థ పాత్ర ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఏకంగా ప్రధాని మోదీని కూడా.. ప్రభావితం చేయగల సంస్థ. అయితే ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు అనేక మంది రాజకీయ నాయకులను అందించింది. తాజాగా.. ఇక దేశ రక్షణ వ్యవస్థకు సైనికులను అందించే పనిని భుజాన వేసుకుంది. దీని కోసం ఆర్మీ తరహా స్కూల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ వింగ్ అయిన విద్యాభారతి దీన్ని నిర్వహించనుంది. ఈ స్కూల్‌కు ఆర్ఎస్ఎస్ మాజీ సర్ సంఘ చాలక్ రాజేంద్రసింగ్ అలియాస్ రాజ్జుభయ్యా పేరు పెట్టనున్నారు.

యూపీలోని బులంద్ షహర్ జిల్లా షికార్‌పూర్‌లో రాజుభయ్యా సైనిక్ విద్యామందిర్‌ పేరుతో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గత ఆగస్ట్‌లో 20 వేల చదరపు మీటర్ల స్థలంలో స్కూల్ నిర్మాణం ప్రారంభమైంది. దీనికోసం రూ.40 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఈ స్థలాన్ని మాజీ సైనికుడు, రైతు రాజ్ పాల్ సింగ్ డోనేట్ చేశారు.

ఈ ఆర్మీ స్కూల్‌లో సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేయనున్నారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ క్లాసులు నిర్వహించనున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి స్కూల్ ప్రారంభంకానుంది. తొలి బ్యాచ్‌లో 160 మంది విద్యార్ధులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఇందులో రిజర్వేషన్ స్కీమ్ కింద అమరవీరుల కుటుంబాల పిల్లలకు 56 సీట్లు రిజర్వ్ చేశారు. స్కూల్‌లోని విద్యార్ధులకు ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?