మీకూ సర్జికల్ స్ట్రైక్ చేయాలనుందా..? అయితే ఇలా చేయండి

సర్జికల్ స్ట్రైక్.. 2016లో కశ్మీర్ లోని యూరి సెక్టార్ల‌లో ఇండియన్ ఆర్మీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన యుద్ధం. ఆ తర్వాత 2019లో పుల్వామా ఘటన తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అందరికీ తెలిసిందే. అప్పుడు భారత్ జరిపిన వైమానిక దాడుల్లో.. వింగ్ కమాండర్ అభినందన్.. మిగ్-21 యుద్ధ విమానంతో.. పాక్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చి.. వాయుసేన సత్తా ఎంటో చూపారు. అనంతరం ఫైటర్ జెట్ కూలడంతో.. […]

మీకూ సర్జికల్ స్ట్రైక్ చేయాలనుందా..? అయితే ఇలా చేయండి
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 9:23 PM

సర్జికల్ స్ట్రైక్.. 2016లో కశ్మీర్ లోని యూరి సెక్టార్ల‌లో ఇండియన్ ఆర్మీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన యుద్ధం. ఆ తర్వాత 2019లో పుల్వామా ఘటన తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అందరికీ తెలిసిందే. అప్పుడు భారత్ జరిపిన వైమానిక దాడుల్లో.. వింగ్ కమాండర్ అభినందన్.. మిగ్-21 యుద్ధ విమానంతో.. పాక్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చి.. వాయుసేన సత్తా ఎంటో చూపారు. అనంతరం ఫైటర్ జెట్ కూలడంతో.. పాక్ భూ భాగంలో దిగి.. శత్రువుల చేతికి చిక్కాడు. అనంతరం రెండు రోజుల తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు. అయితే అప్పటి నుంచి.. దేశంలోని యువత అభినందన్ మీసం క్రేజ్‌గా మారింది. అంతేకాదు.. ఎంతో మంది అతనిలా.. మీసం స్టైల్‌తో హంగామా చేశారు. అయితే.. అలా సర్జికల్ స్ట్రైక్ మనం చేస్తే ఎంత బాగుండోనన్న.. ఆశ ఎంతోమంది మదిలో తన్నింది. అయితే.. ఆ అనుభూతిని ఇప్పుడు వీడియో గేమ్ ద్వారా పొందవచ్చు. నిజమే.. అందుకోసం.. భారత వాయు సేన ఓ వీడియో గేమ్‌ను తీసుకొచ్చింది. ఈ గేమ్ ఆడటం ద్వారా.. వాయుసేనలో చేరాలన్న మక్కువతో పాటుగా..వాయుసేనపై అవగాహన కలుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తోంది. “ఏ కట్ ఎబోవ్” పేరుతో రూపొందించిన ఈ వీడియో గేమ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫ్లాట్‌ఫాంలలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వాయు సేన అధికారులు తెలిపారు.

ఈ గేమ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉంటాయని తెలిపింది. రకరకాల ఫైటర్ జెట్స్‌తో మిషన్స్‌ను పూర్తి చేసుకుంటూ తరువాత లెవల్‌కు వెళ్లాల్సి ఉంటుందని వివరించింది. అయితే ఈ గేమ్ ప్రస్తుతం సింగిల్ ప్లేయర్‌ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉందన్న వాయుసేన.. అక్టోబర్ నాటికి మల్టీ‌ప్లేయర్ ఫీచర్‌ని అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.