వావ్.. వాట్ ఏ డాగ్… అంతా హ్యాట్సాఫ్ చెప్పండి

శిథిలాల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని.. సీఆర్పీఎఫ్‌కు చెందిన ఓ శునకం రక్షించింది. శునకమేంటి రక్షించడమేంటి అనుకుని ఆశ్చర్యపోకండి. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. అంతేకాదు.. పలు ఇళ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో.. రహదారులను మూసివేశారు. అయితే ఈ కొండచరియలు విరిగిపడిన సమయంలో.. అక్కడ ఓ వ్యక్తి ఉన్నాడు. అవి అతని మీద పడటంతో.. అందులో చిక్కుకుపోయాడు. అయితే ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ కు చెందిన […]

వావ్.. వాట్ ఏ డాగ్... అంతా హ్యాట్సాఫ్ చెప్పండి
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 9:39 PM

శిథిలాల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని.. సీఆర్పీఎఫ్‌కు చెందిన ఓ శునకం రక్షించింది. శునకమేంటి రక్షించడమేంటి అనుకుని ఆశ్చర్యపోకండి. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. అంతేకాదు.. పలు ఇళ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో.. రహదారులను మూసివేశారు. అయితే ఈ కొండచరియలు విరిగిపడిన సమయంలో.. అక్కడ ఓ వ్యక్తి ఉన్నాడు. అవి అతని మీద పడటంతో.. అందులో చిక్కుకుపోయాడు. అయితే ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ కు చెందిన ఓ శునకం పసిగట్టింది. 72వ బెలాటియ‌న్‌కు చెందిన బృందంతో ఉండే అజాక్సీ అనే శున‌కం ఆ వ్య‌క్తి చిక్కకుపోయిన స్థలాన్ని గుర్తించింది. ఆ త‌ర్వాత సీఆర్‌పీఎఫ్ స‌భ్యులు కొండ‌చ‌రియ‌ల‌ను తొలిగించ‌డంతో ఆ శిథిలాల కింద ఓ వ్య‌క్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే.. గాయాలవ్వడంతో.. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.