AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆమె కడుపున పుట్టడమే పాపమైంది.. 54 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల కూతురి పెళ్లి.. చివరకు..

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పుంగనూరులోని బీడీ కాలనీలో ఓ తల్లి మైనర్ కూతురును అమ్మకానికి పెట్టింది. రూ. 2 లక్షల కోసం కన్నతల్లి దిగజారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీడీ కాలనీలో ఉంటున్న రామరాజు శోభ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.. అయితే.. తల్లి శోభ పెద్ద కూతుర్ని పక్కా ప్లాన్‌తో అమ్మేసింది

Andhra: ఆమె కడుపున పుట్టడమే పాపమైంది.. 54 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల కూతురి పెళ్లి.. చివరకు..
Mother Sells Minor Daughter
Raju M P R
| Edited By: |

Updated on: Feb 10, 2026 | 4:54 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పుంగనూరులోని బీడీ కాలనీలో ఓ తల్లి మైనర్ కూతురును అమ్మకానికి పెట్టింది. రూ. 2 లక్షల కోసం కన్నతల్లి దిగజారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగనూరు బీడీ కాలనీకి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను 54 ఏళ్ల రెడ్డి రాజశేఖర్ అనే వ్యక్తికి అమ్మేసి చేతులు దులుపుకోవడం సంచలనంగా మారింది. బీడీ కాలనీలో ఉంటున్న రామరాజు శోభ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.. అయితే.. తల్లి శోభ పెద్ద కూతుర్ని పక్కా ప్లాన్‌తో అమ్మేసింది. భార్యాభర్తలు రామరాజు, శోభ మధ్య విభేదాలు తలెత్తాయి.. అయితే.. 2 నెలల క్రితం భర్త రామరాజు తో గొడవపడి శోభ ఇంటి నుంచి వెళ్లిపోయింది. పుంగనూరులోని టిడ్కో ఇళ్ళలో ఉంటున్న  శోభ రెడ్డెప్ప అనే మధ్యవర్తి ద్వారా కూతురును అమ్మకానికి ప్రయత్నించింది. ఈ మేరకు చూడాలని ఉందంటూ పెద్ద కూతుర్ని ఇంటికి పిలిపించుకుంది.

కర్ణాటకలోని రాయల్పాడుకు చెందిన రెడ్డి రాజశేఖర్ (54) రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న రెడ్డప్ప శోభతో బేరసారాలు ఆడాడు. శోభతో మాట్లాడి రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు రాజశేఖర్ మైనర్ బాలికను రెండో పెళ్లి చేసుకోగా దగ్గరుండి తల్లి శోభ పెళ్లి జరిపించింది. ఇక  ఒప్పందం మేరకు శోభకు రూ.50 వేల ఇచ్చి 10 రోజుల క్రితం బెంగళూరులో బాలికను పెళ్లి చేసుకున్న రాజశేఖర్.. తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం రాజశేఖర్ మైనర్ బాలికను చిత్రహింసలకు గురి చేయడంతో భరించలేయింది. దీంతో ఆ బాలిక చిన్నాన్నకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. అనంతరం చిన్నాన్న సహాయంతో పుంగనూరుకు చేరుకుంది. ఈ మేరకు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో బాలిక ను ఐసిడిఎస్ సిబ్బందికి అప్పగించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్ణాటకలో జరిగిన ఘటనగా భావించి పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేయలేదు.. బాలిక కు తగిన సంరక్షణ కల్పించేలా ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.

మైనర్ చదువుకునేందుకు ఏర్పాట్లు..

ఇక మైనర్ బాలిక అమ్మకం వ్యవహారం వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు ఐసిడియస్ అధికారుల చేత విచారణ చేపట్టింది. తల్లితండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ICDS సిబ్బంది.. చదువు కోవాలనుకున్న బాలిక కలను తీర్చేందుకు చర్యలు చేపట్టారు. ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చిన అధికారులు.. ఆదేశాల మేరకు బాలిక చదువుకునే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

డబ్బు కోసం కాదు.. మధ్యవర్తి చేత మోసపోయి…

పుంగనూరుకు చెందిన మైనర్ బాలికను అమ్మిన తల్లి నిర్వాకంపై ఐసిడిఎస్ అధికారుల విచారణ చేపట్టారు. ఎన్నో నిజాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఎవరితోనూ డబ్బులు తీసుకోలేదన్న తల్లి శోభ ను విచారించి వివరాలు సేకరించారు. భర్తతో మనస్పర్థలు వచ్చే  ఇంటి నుంచి బయటకు వచ్చానన్న శోభ.. తెలిసో తెలియకో తప్పు చేసినట్లు అంగీకరించింది. కూతురు కోరిక మేరకు అధికారులే చదివిస్తామని చెప్పారని.. రెడ్డెప్ప నమ్మించి మోసం చేసాడని శోభ ఆరోపిస్తోంది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే