AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పాపం పండింది.. పాఠాలు చెప్పాల్సిన టైమ్‌లో జైల్లో ఊచలు లెక్కబెడుతున్న కీచక టీచర్..

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. ఆ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మార్గ నిర్దేశం చేయవలసిన వాడు లైంగిక వేధించాడు. దీంతో వాడి చేష్టలతో విసిగెత్తిన ఆ విద్యార్థులు.. తమతో టీచర్ ప్రవర్తిస్తున్న తీరును పేరెంట్స్‌కు తెలియజేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు పట్టుకున్నారు. కట్ చేస్తే.. విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ఆ టీచర్ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.

Andhra Pradesh: పాపం పండింది.. పాఠాలు చెప్పాల్సిన టైమ్‌లో జైల్లో ఊచలు లెక్కబెడుతున్న కీచక టీచర్..
Paderu Agency Sgt Teacher Arrested
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 10, 2026 | 8:46 PM

Share

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటారు.. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థాయి గురువులది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి జీవితంలో సక్రమమార్గం వైపు అడుగులు వేయించే బాధ్యత వారిది. టీచర్ చేతిలో పడితే తమ పిల్లల భవిష్యత్తుకు భరోసా కలుగుతుందని భావిస్తారు పేరెంట్స్. ఎందుకు అనుగుణంగానే చాలామంది ఉపాధ్యాయులు విద్యార్థులు ఎదుగుదల కోసం నిస్వార్ధంగా పనిచేస్తారు. విద్యాబుద్ధుడు నేర్పించడమే కాకుండా తమ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తారు. అయితే కొందరు చేసే చర్యలు ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చేలా ఉంటున్నాయి. కన్నబిడ్డల చూసుకోవలసిన విద్యార్థులకు ఉపాధ్యాయులు లైంగికంగా వేధిస్తున్న ఘటనలు జరుగుతున్నడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా అల్లూరి ఏజెన్సీలోని ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు

పేరెంట్స్ ఆందోళనతో..

పాడేరు ఏజెన్సీలోని ఓ ఎంపీపీ స్కూల్లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నాడు పాంగి సుబ్రహ్మణ్యం. ప్రధానోపాధ్యాయుడుగా బాధ్యతలు కూడా చూస్తున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు చేష్టల పట్ల విసిగెత్తి పోయారు విద్యార్థులు. క్లాస్ రూమ్‌లో పాటలు చెప్పకపోవడం.. విద్యార్థులతో పనులు చేయించుకోవడంతో పాటు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడట. దీంతో కొన్నాళ్లపాటు వీడి చేష్టలను భరించిన విద్యార్థినులు. తమ పేరెంట్స్‌కు విషయాన్ని చెప్పారు. తమతో సుబ్రమణ్యం ప్రవర్తిస్తున్న తీరును చెప్పడంతో విద్యార్థినిల తల్లిదండ్రులు గుండెలు పట్టుకున్నారు. తమ చిట్టి తల్లులకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. స్కూలు ఎదుట ఆందోళన చేసి ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్ సీరియస్..

పేరెంట్స్ ఫిర్యాదుతో విచారణ చేసిన మండల విద్యాశాఖ అధికారి ఈనెల 5న ప్రాథమిక నివేదికను సమర్పించారు. కలెక్టర్ ఈ విషయంలో సీరియస్‌గా తీసుకొని సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి, ఐసీడీఎస్‌పీడి మరుసటి రోజు పాఠశాలలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్య కమిటీ, సర్పంచ్ గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపారు. తుది నివేదికను కలెక్టర్‌కు అందజేశారు.

సస్పెన్షన్.. అరెస్ట్..

ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తెలియడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. దీంతోపాటు ఉపాధ్యాయుడుపై విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రాథమిక ఆధారాలు సేకరించి కీచక టీచర్ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశామని పాడేరు సిఐ దీనబంధు తెలిపారు. ఎట్టకేలకు ఆ కీచక ఉపాధ్యాయుడు పాపం పండడంతో కటకటాల వెనక్కు వెళ్ళాడు. బాధ్యతగల ఉద్యోగంలో ఉండి పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో.. వక్ర బుద్ధితో ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.